LOADING...
Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ నియామకం
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ నియామకం

Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ నియామకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ (Delcy Rodriguez)ను నియమిస్తున్నట్లు ఆ దేశ సుప్రీం కోర్టు అధికారికంగా ప్రకటించింది. వెనెజువెలా రాజధాని కారకాస్‌పై అమెరికా సైన్యం మెరుపుదాడి చేసి, అధ్యక్షుడు నికొలస్‌ మదురోతో పాటు ఆయన భార్యను బంధించి అమెరికాకు తరలించిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు వెల్లడించింది. ప్రభుత్వ పరిపాలనలో అంతరాయం కలగకుండా కొనసాగించడంతో పాటు, దేశ భద్రత, రక్షణ వ్యవస్థలను పటిష్టంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే డెల్సీ రోడ్రిగ్స్‌ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించినట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Advertisement