
South Korea: సతీమణి ఓ బ్యాగ్ కారణంగా.. దక్షిణ కొరియా అధినేతకు చిక్కులు.. ఇంతకీ ఏంటా వివాదం?
ఈ వార్తాకథనం ఏంటి
అకస్మాత్తుగా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి తీవ్ర కష్టాల్లో చిక్కుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ రాజకీయ పరంగా ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ఆయనకు ఎదురవుతున్న అభిశంసన ముప్పు, తన భవిష్యత్తు పై ప్రభావం చూపించేలా ఉంది.
అయితే, ఈ దేశాధినేత ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే తొలిసారి కాదు.
కొంతకాలం క్రితం, ఆయన సతీమణి అందుకున్న ఓ కానుక ఆయనను చిక్కుల్లో పడేసింది.
దేశ రాజకీయాలను కుదిపేసిన ఆ కుంభకోణం ఆయన ప్రతిష్ఠను మసకబార్చింది. ఇంతకీ ఏంటా వివాదం..?
వివరాలు
బ్యాగ్ విలువ సుమారు 2250 డాలర్లు
ఈ వివాదం గురించి వివరించాలంటే, 2022లో, అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సతీమణి కిమ్ కియోన్ హీ ఒక ఖరీదైన డియోర్ బ్యాగ్‌ను గిఫ్ట్‌గా అందుకున్నారు.
ఈ బ్యాగ్ విలువ సుమారు 2250 డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.9 లక్షలు.
ఈ ఖరీదైన కానుకను ఇచ్చిన వ్యక్తి, ఉత్తర కొరియా పై యూన్ సుక్ యోల్ కఠినమైన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించే పాస్టర్ చాయ్ జే యంగ్.
ఈ ఘటన 2023 నవంబరులో వెలుగులోకి వచ్చింది, అదే సమయంలో ఈ అంశం దక్షిణ కొరియాలో రాజకీయ వాగ్వాదానికి కారణమైంది.
వివరాలు
బ్యాగు తెచ్చిన రాజకీయ సునామీ..
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ (Yoon Suk Yeol) సతీమణి కిమ్ కియోన్ హీ, రెండు సంవత్సరాల క్రితం ఓ పాస్టర్ నుండి ఒక ఖరీదైన డియోర్ బ్యాగ్‌ను గిఫ్ట్‌గా అందుకున్నారు.
ఆ బ్యాగ్ విలువ దాదాపు 2250 డాలర్లుగా (భారత కరెన్సీలో సుమారు 1.9 లక్షల రూపాయలు) అంచనా వేయబడింది.
ఉత్తర కొరియాపై తన కఠినమైన వైఖరికి వ్యతిరేకంగా ఉండే పాస్టర్ చాయ్ జే యంగ్ ఈ గిఫ్ట్‌ను ప్రథమ మహిళకు ఇచ్చారు.
2023 నవంబరులో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
వివరాలు
వాచ్‌లోని రహస్య కెమెరాతో రికార్డ్
2022లో ఫస్ట్ లేడీ కిమ్ కియోన్ ఆఫీసుకు వెళ్లినప్పుడు, పాస్టర్ చాయ్ ఆమెకు ఈ బ్యాగ్ ఇస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.
ఈ వీడియోలో కిమ్ కియోన్ హీ ఇలా అంటోంది: ''ఇలాంటి ఖరీదైన వస్తువులను నేను ఎప్పుడూ కొనలేదు, వీటిని ఎందుకు తీసుకువస్తున్నారు?''
ఈ వీడియోను పాస్టర్ తన చేతిలోని వాచ్‌లోని రహస్య కెమెరాతో రికార్డ్ చేశారు.
కొన్నేళ్ల తరువాత ఈ వీడియో ఓ లెఫ్ట్ వింగ్ పొలిటికల్ సైట్‌లో లీక్ అవడంతో అది చాలా వైరల్ అయింది.
దీంతో అధ్యక్షుడు, ఆయన సతీమణిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రథమ మహిళకు లంచం ఇచ్చారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.
వివరాలు
ప్రథమ మహిళ కిమ్ కియోన్‌ను దర్యాప్తు అధికారులు సుమారు 12 గంటలపాటు విచారించారు
ద. కొరియా చట్టాల ప్రకారం,ఒకేసారి 750 యూఎస్ డాలర్ల విలువ లేదా ఒక సంవత్సరం లో 2,200 డాలర్ల విలువైన బహుమతులు స్వీకరించడం చట్టానికి విరుద్ధం.
ఈ చట్టం ప్రకారం, ఈ అంశం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై అధికార వర్గాలు స్పందిస్తూ, ఆ గిఫ్ట్ తీసుకోవడం నిజమేనని ధ్రువీకరించారు.
తదనంతరం, ఆ బహుమతిని ప్రభుత్వ ఆస్తిగా భద్రపరిచామని చెప్పారు.
ఈ క్రమంలో 2023 జులైలో, ప్రథమ మహిళ కిమ్ కియోన్‌ను దర్యాప్తు అధికారులు సుమారు 12 గంటలపాటు విచారించారు.
అయితే, ఆ బ్యాగ్ లంచంగా స్వీకరించినట్లు ఎలాంటి సాక్ష్యాలు లభించకపోవడంతో ఆమెకు క్లీన్‌చిట్ ఇవ్వబడింది.
అయినప్పటికీ, ప్రతిపక్షాలు ఇప్పటికీ ఈ వ్యవహారంపై విచారణ కొనసాగించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.
వివరాలు
కొంపముంచిన ఎమర్జెన్సీ ప్రకటన..
సతీమణి బ్యాగు వివాదం తర్వాత, దక్షిణ కొరియాలో అధ్యక్షుడిపై ప్రజల వ్యతిరేకత పెరిగింది.
ఈ సమయంలో, ఆయన చేసిన 'మార్షల్ లా' ప్రకటన భారీ ప్రతిఘటనను కలిగించింది.
దేశవ్యాప్తంగా తిరుగుబాటు పరిస్థితులు ఉన్నాయని, ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ, అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ 'ఎమర్జెన్సీ మార్షల్ లా'ని ప్రకటించారు.
అయితే, ఈ ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో, పార్లమెంట్‌లో ఓటింగ్ నిర్వహించి, అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు.
ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుని, అధ్యక్షుడు తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు.
వివరాలు
అధ్యక్షుడి రాజ్యాంగ హక్కుల్లో కోత
ఈ పరిస్థితులపై ప్రతిపక్షాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అభిశంసన తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
అదే సమయంలో, ఆయనకు తన సొంత పార్టీలో కూడా మద్దతు లేకుండా పోయింది.
అధ్యక్షుడి రాజ్యాంగ హక్కుల్లో కోత విధించేందుకు అధికార పార్టీ కూడా సిద్ధమైంది.
ఈ పరిణామాల దృష్ట్యా, యూన్ సుక్ యోల్ పదవి నుంచి తొలగించబడడం అనివార్యంగా కనిపిస్తోంది.