Loading...
Miss World: మిస్‌ వరల్డ్‌-2026గా డొమినికన్‌ రిపబ్లిక్‌ భామ.. జోహెరి మోలా డొమింగ్వెజ్‌ కిరీటం సొంతం!
మిస్‌ వరల్డ్‌-2026గా డొమినికన్‌ రిపబ్లిక్‌ భామ.. జోహెరి మోలా డొమింగ్వెజ్‌ కిరీటం సొంతం!

Miss World: మిస్‌ వరల్డ్‌-2026గా డొమినికన్‌ రిపబ్లిక్‌ భామ.. జోహెరి మోలా డొమింగ్వెజ్‌ కిరీటం సొంతం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 06, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిస్‌ వరల్డ్‌-2026 కిరీటాన్ని డొమినికన్‌ రిపబ్లిక్‌కు చెందిన జోహెరి మోలా డొమింగ్వెజ్‌ సొంతం చేసుకున్నారు. వియత్నాంలో జరిగిన 73వ మిస్‌ వరల్డ్‌ పోటీలో ఆమె విజేతగా నిలిచారు. ఈ పోటీలో స్పెయిన్‌కు చెందిన ఎలిజబెత్‌ రెయిన్స్‌ ద్వితీయ స్థానాన్ని దక్కించుకోగా.. మలేసియాకు చెందిన తనూసియా చెట్టి తృతీయ స్థానంలో నిలిచారు. జోహెరి మోలా డొమింగ్వెజ్‌ వృత్తిరీత్యా టీచర్‌, సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్నారు. పేద పిల్లల కోసం తన సంస్థ ద్వారా ఆంగ్ల భాషను బోధిస్తూ వారికి విద్య అందిస్తున్నారు. ఇక భారత్‌కు చెందిన మిస్‌ ఇండియా వరల్డ్‌-2024 నికిత పొర్వాల్ టాప్‌ 40 మంది పోటీదారుల్లో చోటు సంపాదించారు. అయితే ఆమె టాప్‌ 20లోకి ప్రవేశించలేకపోయారు.

ADVERTISEMENT