Page Loader
మరో వివాదంలో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అణు జలాంతర్గామి రహస్యాలను ఆస్ట్రేలియా వ్యాపారవేత్తకు లీక్
అమెరికా అణు జలాంతర్గామి రహస్యాలను ఆస్ట్రేలియా వ్యాపారవేత్తకు లీక్

మరో వివాదంలో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అణు జలాంతర్గామి రహస్యాలను ఆస్ట్రేలియా వ్యాపారవేత్తకు లీక్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 06, 2023
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఆరోపణల బారిన పడ్డారు. ఈ మేరకు అగ్రరాజ్యం అణు జలాంతర్గామికి సంబంధించిన వివరాలను ఆస్ట్రేలియన్ బిలియనీర్ ఆంథోనీ ప్రాట్‌తో పంచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అణు జలాంతర్గామికి సంబంధించి సున్నితమైన,రహస్య వివరాలను చర్చించినట్లు అగ్రదేశ మీడియా కోడైకూస్తోంది. యూఎస్ సబ్‌ల్లో అణు వార్‌హెడ్‌లు ఉన్నాయని, వాటిని గుర్తించకుండా రష్యా జలాంతర్గామికి ఎంతో దగ్గరగా చేరుకోగలవని ట్రంప్ ఆంథోనీ ప్రాట్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. ట్రంప్ పదవీ విరమణ చేసిన కొద్ది నెలల తర్వాత ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో క్లబ్‌లో ఈ సంభాషణ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల కేసులో భాగంగా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఈ విషయంపై ప్రాట్‌ను 2 సార్లు ఇంటర్వ్యూ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మరో వివాదంలో చిక్కుకున్న డొనాల్డ్ ట్రంప్