Page Loader
Donald trump: నన్ను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతమే: డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ 
Donald trump: తనను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతమే: డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్

Donald trump: నన్ను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతమే: డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
Mar 17, 2024
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది వార్తే అవుతుంది. బరువైన పదజాలలను వాడుతూ.. తరుచూ వార్తల్లో నిలవడం ఆయన వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పాలి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. అధ్యక్ష ఎన్నికల్లో తనను ఎన్నుకోకపోతే దేశంలో 'రక్తపాతం' తప్పదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఒహియో సమీపంలో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ఇప్పుడు తనను ఎన్నుకోకపోతే రక్తపాతం జరుగుతుందని అన్నారు.

అమెరికా

నేను అధ్యక్షుడినేతే చైనా కార్లను విక్రయం కుదరదు: ట్రంప్

అయితే ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది ర్యాలీలో పాల్గొన్న వారికి కాసేపు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఆటోమొబైల్ పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. రక్తపాతం జరుగుతుందని అనడంపై అందరూ అయోమయానికి గురయ్యారు. వాస్తవానికి ఒహియో సభలో ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకున్న వాహనాల గురించి మట్లాడారు. తాను మళ్లీ అధ్యక్షుడినైతే చైనా వాహనాల విక్రయం కుదరని చెప్పారు. తాను ఎన్నిక కాకుంటే చైనా వాహనాల విక్రయాలు పెరుగుతాయని ట్రంప్ వెల్లడించారు. చైనా అనగానే ఎరుపు రంగు గుర్తు వస్తుంది. ఈ కోణంలోనే ట్రంప్ 'రక్తపాతం' పెరుగుతుందని అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.