
Trump: అమెరికా ఫెడరల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ మూసివేత దిశగా ట్రంప్ అడుగులు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించారు.
దీనిలో భాగంగా, విద్యాశాఖలో ఉద్యోగాల్లో భారీ కోతలు విధించిన ఆయన, ఇప్పుడు శాఖను పూర్తిగా మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఈ దిశగా త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశముందని అంతర్జాతీయ మీడియా నివేదిస్తోంది.
విద్యాశాఖ ఉదారవాద భావజాలంతో కలుషితమైందని ట్రంప్ భావిస్తున్నట్లు పేర్కొంది.
"విద్యాశాఖను మూసివేయడానికి,ఆ శాఖ అధికారాలను రాష్ట్రాలకు తిరిగి అప్పగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అయితే, అమెరికా ప్రజలకు అందుతున్న విద్యా సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలి" అని విద్యాశాఖ మంత్రి లిండా మెక్‌మాన్‌కు పంపిన వైట్‌హౌస్ ఫ్యాక్ట్‌షీట్‌లో పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
వివరాలు
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లిండా మెక్‌మాన్
అయితే, అమెరికా చట్టసభల అనుమతి లేకుండా విద్యాశాఖను పూర్తిగా మూసివేయడం దాదాపుగా అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా, విద్యాశాఖలోని సిబ్బందిని సగానికి తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో ప్రభుత్వం వెల్లడించింది.
లిండా మెక్‌మాన్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజుల్లోనే ఈ చర్యలను ప్రారంభించారు.
వివరాలు
విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు
"ట్రంప్ నాకు ఇచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. విద్యాశాఖను మూసివేయడానికి మేం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి, అవసరానికి మించి ఉన్న ఉద్యోగాలపై కోత విధిస్తున్నాం" అని లిండా మెక్‌మాన్ ఇటీవల పేర్కొన్నారు.
ట్రంప్ ప్రభుత్వంలో విద్యాశాఖను రద్దు చేసి, అధికారాలను రాష్ట్రాలకు అప్పగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ట్రంప్ బాధ్యతలు స్వీకరించే నాటికి విద్యాశాఖలో 4,100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణకు అంగీకరించారు.