Loading...
Persian Gulf: పర్షియన్ గల్ఫ్‌లో భారతీయ నావికులున్న నౌకపై క్షిపణి దాడి
పర్షియన్ గల్ఫ్‌లో భారతీయ నావికులున్న నౌకపై క్షిపణి దాడి

Persian Gulf: పర్షియన్ గల్ఫ్‌లో భారతీయ నావికులున్న నౌకపై క్షిపణి దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

పర్షియన్ గల్ఫ్‌లో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది. లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న 'ఎం.టి. ఫుజైరా ఎనర్జీ' నౌకను నవంబర్ 10న లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ నౌకలో ఆరుగురు భారతీయ నావికులు సహా మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. దాడిలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఒక భారతీయ నావికుడికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని తదుపరి వైద్య పరీక్షల కోసం సురక్షితంగా ఒడ్డుకు తరలించారు.

వివరాలు 

అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం

మిగిలిన 20 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారు. వారిలో ఐదుగురు భారతీయ నావికులు కూడా ఉన్నారు.

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు.

నౌకలోని సిబ్బంది భద్రత, వైద్య సంరక్షణ, క్షేమం విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.

ఇందుకోసం నౌక యాజమాన్య సంస్థతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

ADVERTISEMENT