Dubai: భవిష్యత్ రవాణాకు నాంది ఈ ఎయిర్ ట్యాక్సీ స్టేషన్.. ఎక్కడంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ నిలయం సిద్ధమైంది. ఈ విషయాన్ని యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్( Hamdan bin Mohammed bin Rashid Al Maktoum) ప్రకటించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సుమారు 3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ సెషన్ ని నిర్మించారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రయాణికులకు ఇది అందుబాటులోకి రానుంది. ఏటా సుమారు 1,70,000 మంది ప్రయాణించేందుకు అనుకూలంగా ఈ ఏర్పాట్లు చేశారు.
వివరాలు
కేవలం 10 నిమిషాల్లోనే గమ్యస్థానం
సాధారణంగా కారులో సుమారు 45 నిమిషాలు పట్టే ప్రయాణాన్ని ఎయిర్ ట్యాక్సీల ద్వారా కేవలం 10 నిమిషాల్లో గమ్యస్థానం చేరచ్చు. ఈ స్టేషన్ ని నేరుగా పైకి ఎగిరి, నేరుగా దిగే విద్యుత్ విమానాల కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఇందులో రెండు దిగే ప్రదేశాలు, విద్యుత్ విమానాల కోసం ఛార్జింగ్ పాయింట్లు, రెండు అంతస్తుల వాహన నిల్వ ప్రదేశం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఆధునికమైన,పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ సిద్ధం.. ఎక్కడంటే..?
Today, I reviewed the progress of Dubai’s air taxi station, the first of its kind in the world, located near Dubai International Airport. The station is ready and forms part of a wider network including Downtown, Palm Jumeirah, and Dubai Marina, which will be completed by the end… pic.twitter.com/cq0nvZbXAH
— Hamdan bin Mohammed (@HamdanMohammed) April 16, 2026