Loading...
Nuclear scare: అమెరికా అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. అత్యవసర పరిస్థితి ప్రకటన
అమెరికా అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. అత్యవసర పరిస్థితి ప్రకటన

Nuclear scare: అమెరికా అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. అత్యవసర పరిస్థితి ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 29, 2026
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని సౌత్‌ కరోలినా రాష్ట్రంలో అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమెరికా ఇంధన శాఖకు చెందిన ఈ కేంద్రంలోని ఓ గదిలో మంటలు చెలరేగడంతో రేడియేషన్‌ లీకై ఉండొచ్చనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టి, ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

వివరాలు 

రెండు గంటల్లో అదుపులోకి మంటలు

సౌత్‌ కరోలినాలోని సవన్నా రివర్‌ నేషనల్‌ లేబరేటరీలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాదం జరిగిన రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఈ ఘటనలో భవనం వెలుపలికి రేడియోధార్మిక పదార్థాలు విడుదల కాలేదని స్పష్టం చేశారు.

రేడియోధార్మికత ప్రయోగశాల ప్రాంగణానికే పరిమితమైందని, బయట ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొన్నారు.

ముందుజాగ్రత్తగా రాకపోకలు నిలిపివేత

అయితే, రేడియేషన్‌ లీకేజీపై ఆందోళనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రయోగశాలలోకి వెళ్లే ప్రవేశ మార్గాలను మూసివేశారు. సమీప ప్రాంతాల్లో రాకపోకలను కూడా నిలిపివేశారు.

ఈ ఘటనతో అణు పరిశోధనా కేంద్రం వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సౌత్ కరోలినాలో అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం

ADVERTISEMENT