Loading...
Flights declare: ఒకేసారి 9 విమానాలు అత్యవసర సంకేతాలు.. లండన్ గ్యాట్‌విక్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి
ఒకేసారి 9 విమానాలు అత్యవసర సంకేతాలు.. లండన్ గ్యాట్‌విక్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి

Flights declare: ఒకేసారి 9 విమానాలు అత్యవసర సంకేతాలు.. లండన్ గ్యాట్‌విక్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి

వ్రాసిన వారు Moogati Shabari
Jul 16, 2026
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూకే రాజధాని లండన్‌లోని గ్యాట్‌విక్ విమానాశ్రయంలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. టెనెరీఫ్, వలెన్సియా, లాంజరోట్, రోడ్స్, ఏథెన్స్, బారి, రోమ్, అగాదిర్ నుంచి గ్యాట్‌విక్‌కు వస్తున్న మొత్తం తొమ్మిది విమానాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ఈ పరిస్థితికి కారణం గ్యాట్‌విక్ విమానాశ్రయంలోని ఏకైక రన్‌వేపై బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిర్‌బస్ A320 విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోవడమే. విమానం నోస్ గేర్ స్టీరింగ్‌లో సమస్య తలెత్తడంతో అది రన్‌వేపైనే ఆగిపోయింది. ఆ విమానాన్ని అక్కడి నుంచి తొలగించడానికి దాదాపు 30 నిమిషాల సమయం పట్టింది.

వివరాలు

ఇతర విమానాశ్రయాలకు మళ్లింపు..

దీంతో గ్యాట్‌విక్‌లో ల్యాండ్ కావాల్సిన విమానాలు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.

మరికొన్ని విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. మొత్తం 14 విమానాలు ఈ ఘటనతో ప్రభావితమయ్యాయి.

వాటిని లండన్‌లోని లూటన్, స్టాన్‌స్టెడ్, హీత్రూ, అలాగే బర్మింగ్‌హామ్ విమానాశ్రయాలకు దారి మళ్లించారు.

అయితే బుధవారం తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో గ్యాట్‌విక్ విమానాశ్రయం తిరిగి సాధారణ కార్యకలాపాలు ప్రారంభించింది.

ఈ ఘటనపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయంగా గ్యాట్‌విక్‌కు గుర్తింపు ఉందని అధికారులు తెలిపారు.

ఈ విమానాశ్రయం ద్వారా ప్రతి ఏడాది 2.63 లక్షలకు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు.

ADVERTISEMENT