LOADING...
Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై ఒత్తిడి.. సూపర్ బౌల్‌లో సంచలన వీడియో విడుదల
ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై ఒత్తిడి.. సూపర్ బౌల్‌లో సంచలన వీడియో విడుదల

Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై ఒత్తిడి.. సూపర్ బౌల్‌లో సంచలన వీడియో విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్‌స్టీన్ ఫైల్స్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈవెంట్‌లలో ఒకటైన సూపర్ బౌల్‌ను వేదికగా చేసుకుని, జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితులు తమ బాధను దేశం మొత్తం వినేలా బయటపెట్టారు. యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌కు చెందిన ఈ మహా ఈవెంట్ సందర్భంగా, ఎన్నాళ్లుగానో మౌనంగా నలిగిపోయిన బాధితులు ఒక్కసారిగా ధైర్యంగా ముందుకొచ్చారు. నిజం బయటకు రావాలంటూ గట్టిగా గళమెత్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద లైంగిక అక్రమ రవాణా కేసుగా పేరుగాంచిన ఈ వ్యవహారంలో సంపూర్ణ సత్యం ప్రజలకు తెలియాలంటూ ఒక వీడియోను విడుదల చేశారు.

వివరాలు 

'వరల్డ్ విదౌట్ ఎక్స్‌ప్లాయిటేషన్' సంస్థ విడుదల చేసిన వీడియో 

ఈ వీడియోను 'వరల్డ్ విదౌట్ ఎక్స్‌ప్లాయిటేషన్' అనే సంస్థ విడుదల చేసింది. ఇందులో ఎప్‌స్టీన్ బాధితులు ఒక్కొక్కరుగా కెమెరా ముందుకు వచ్చి తమ అనుభవాలను వివరించారు. "మాతో పాటు నిలబడండి" అంటూ అమెరికా ప్రజలను కోరారు. ముఖ్యంగా యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీని ఉద్దేశించి, ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన మిగిలిన అన్ని రికార్డులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన 'ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్' ప్రకారం ఈ డాక్యుమెంట్లను విడుదల చేయాలని వారు స్పష్టం చేశారు. వీడియోలో బాధిత మహిళల మాటల్లో తాము అనుభవించిన వేదన స్పష్టంగా కనిపిస్తుంది. తమ చిన్ననాటి ఫొటోలు చూపిస్తూ, చిన్న వయసులోనే ఎప్‌స్టీన్ చేతుల్లో దాడికి గురయ్యామని వారు గుర్తు చేశారు.

వివరాలు 

సూపర్ బౌల్ రోజునే ఈ ప్రకటన ప్రసారం

ఈ నేరాల్లో ఇంకా ఎవరి పాత్ర ఉందో ప్రజలకు తెలియాలంటూ విజ్ఞప్తి చేశారు. వీడియో చివర్లో స్క్రీన్‌పై పెద్ద అక్షరాల్లో కనిపించిన నినాదం అందరి దృష్టిని ఆకర్షించింది. "మాతో నిలబడండి. అటార్నీ జనరల్ పామ్ బాండీకి చెప్పండి:ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది" అని అందులో పేర్కొన్నారు. సూపర్ బౌల్ రోజునే ఈ ప్రకటనను ప్రసారం చేయడం వెనుక స్పష్టమైన వ్యూహం ఉందని తెలుస్తోంది. దేశంలో అత్యధికంగా వీక్షించే ఈ ఈవెంట్‌ను ఆసరాగా చేసుకుని న్యాయశాఖపై ఒత్తిడి పెంచాలన్నదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే వీడియోను ఆన్‌లైన్‌లో కూడా విడుదల చేశారు. "ప్రతి అమెరికన్ తప్పక చూడాల్సిన సూపర్ బౌల్ యాడ్ ఇదే" అనే శీర్షికతో ఆ సంస్థ దీనిని పోస్ట్ చేసింది.

Advertisement

వివరాలు 

భారీ మొత్తంలో పత్రాలను బహిర్గతం చేసిన అమెరికా న్యాయశాఖ

ఈ వీడియోకు రాజకీయంగా కూడా మద్దతు లభిస్తోంది. డెమొక్రటిక్ ఎంపీ రాబర్ట్ గార్సియా దీనిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన మద్దతును ప్రకటించారు. "ఇది కేవలం ఒక ప్రకటన కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద లైంగిక అక్రమ రవాణా కేసును మనం సులభంగా పక్కన పెట్టలేం. నిజం బయటకు రావాల్సిందే" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రచారం ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందే అమెరికా న్యాయశాఖ భారీ మొత్తంలో పత్రాలను బహిర్గతం చేసింది.

Advertisement

వివరాలు 

మొత్తం ఫైల్స్‌లో ఇది కేవలం సగమే.. అంగీకరించిన న్యాయశాఖ 

జనవరి 30న సుమారు 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 2 వేల వీడియోలు, లక్షా ఎనభై వేల చిత్రాలను విడుదల చేసింది. అయితే ఇది సరిపోదని బాధితులు, వారి హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు చెబుతున్నాయి. మొత్తం ఫైల్స్‌లో ఇది కేవలం సగమేనని న్యాయశాఖే అంగీకరించింది. మిగిలిన ఫైల్స్‌లో బాధితుల వ్యక్తిగత వివరాలు, చట్ట పరిరక్షణకు సంబంధించిన సమాచారం ఉందని వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సూపర్ బౌల్‌లో బాధితుల నిరసన స్వరం

Advertisement