Essar Group: అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడులు.. రూ.1.4 లక్షల కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఎస్సార్ గ్రూప్ అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. అమెరికాలోని తన అనుబంధ సంస్థ మెసాబి మెటాలిక్స్ ద్వారా 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.4 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయోవా రాష్ట్రంలో భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ పెట్టుబడులను వినియోగించనున్నారు. ఈ ప్రాజెక్టును అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగార ప్రాజెక్టుగా ట్రంప్ అభివర్ణించారు.
వివరాలు
1,750 శాశ్వత ఉద్యోగాలు
పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఏటా సుమారు 10 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉండనుంది.
ఈ కర్మాగారం నిర్మాణ సమయంలో సుమారు 6 వేల మందికి తాత్కాలికంగా ఉపాధి లభించనుంది.
నిర్మాణం పూర్తైన తర్వాత మైనింగ్, తయారీ తదితర విభాగాల్లో సుమారు 1,750 శాశ్వత ఉద్యోగాలు ఏర్పడనున్నాయి.
అమెరికాలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.