'Worst on record':యూరప్‌లో రికార్డు స్థాయి ఎండలు.. మూడు నెలల్లో 50 వేలకుపైగా మరణాలు
ఈ వార్తాకథనం ఏంటి
శీతల వాతావరణానికి పేరుగాంచిన ఐరోపా ఖండం ప్రస్తుతం ఎండ తీవ్రతతో అల్లాడిపోతోంది. ఎల్‌నినో ప్రభావం,వాతావరణ మార్పుల కారణంగా అనేక దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య వడదెబ్బ కారణంగా యూరప్‌లో 50,000 మందికి పైగా మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో సుమారు 32,600 మంది శిలాజ ఇంధనాల కాలుష్యం కారణంగా ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఒక్క బ్రిటన్‌లోనే ఈ వేసవిలో 4,354 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నట్లు తెలుస్తోంది. బెల్జియం,ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాల్లోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వివరాలు
అత్యంత తీవ్రంగా వడగాల్పులు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఈ ఏడాది ఐరోపా ఎదుర్కొంటున్న వడగాల్పులు అత్యంత తీవ్రంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనందువల్లే యూరప్ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు.
ఐరోపా దేశాలు సమన్వయంతో వేగంగా చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సహారా ఎడారి నుంచి ఉత్తర దిశగా కదులుతున్న వేడి గాలులు,ఎల్‌నినో ప్రభావం కారణంగా యూరప్‌లో హీట్‌డోమ్ పరిస్థితులు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు వివరించారు.
ఈ ప్రభావంతో వాతావరణంలో వేడి చిక్కుకుపోయి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయని పేర్కొన్నారు.
వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్ననేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.