Loading...
Nepal Floods : నేపాల్‌ వరదల్లో ఊరంతా కొట్టుకుపోయినా.. ఆ ఒక్క ఇల్లు ఎలా నిలిచిందంటే?
నేపాల్‌ వరదల్లో ఊరంతా కొట్టుకుపోయినా.. ఆ ఒక్క ఇల్లు ఎలా నిలిచిందంటే?

Nepal Floods : నేపాల్‌ వరదల్లో ఊరంతా కొట్టుకుపోయినా.. ఆ ఒక్క ఇల్లు ఎలా నిలిచిందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 30, 2026
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ లో వరద ఉద్ధృతికి ఊరిలోని ఇళ్లన్నీ కొట్టుకుపోయినా.. మధ్యలో ఉన్న ఓ ఇల్లు మాత్రం కూలిపోకుండా స్థిరంగా నిలబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆ ఒక్క ఇల్లు ఎలా తట్టుకుని నిలబడిందనే దానిపై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మేఘా అనే నెటిజన్‌ ఈ ఘటనకు గల కారణాలను విశ్లేషించారు. వరదకు సంబంధించిన ప్రధాన బురద ప్రవాహం కుడి నుంచి ఎడమ వైపునకు వెళ్తున్నట్లు కనిపిస్తోందని ఆమె తెలిపారు. అయితే ఆ ఇంటికి ఎదురుగా ఉన్న డ్రమ్ము వద్ద మాత్రం ప్రవాహం ఎడమ నుంచి కుడి వైపునకు సాగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోందని వివరించారు.

వివరాలు

ఇల్లు సురక్షితమైన ప్రాంతంలో నిర్మించి ఉండే అవకాశం

అంటే ఆ ఇంటి చుట్టూ కొంత ప్రాంతంలో బురద ప్రవాహం వలయాకారంగా ఏర్పడి, ప్రధాన ప్రవాహానికి వ్యతిరేక దిశలో సాగినట్లు కనిపిస్తోందని మేఘా పేర్కొన్నారు.

దీని కారణంగా ఆ ఇల్లు ఉన్న ప్రాంతం వద్ద ప్రధాన వరద ప్రవాహం ఉద్ధృతి తగ్గి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇంటి చుట్టూ ఉన్న నీరు.. ఇంటికి, చెట్టుకు మధ్య ఉన్న సన్నని సందు గుండా ప్రవహించి, ఆ తర్వాత మళ్లీ ప్రధాన ప్రవాహంలో కలిసినట్లు కనిపిస్తోందని ఆమె తెలిపారు.

అదే సమయంలో వరద ప్రవాహం ధాటిని తట్టుకునే విధంగా ఆ ఇల్లు సాపేక్షంగా సురక్షితమైన ప్రాంతంలో నిర్మించి ఉండే అవకాశం కూడా ఉందన్నారు.

వివరాలు

దీనిపై నిపుణులు శాస్త్రీయంగా వివరణ ఇవ్వాల్సి ఉంది

అయితే ఇంటి చుట్టూ ఏర్పడిన ప్రాంతంలో నీరు ప్రధాన ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఎందుకు ప్రవహించిందనే విషయాన్ని మాత్రం తాను కచ్చితంగా చెప్పలేనని మేఘా స్పష్టం చేశారు.

దీనిపై నిపుణులు శాస్త్రీయంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.

మరోవైపు.. ఈ ఇంటిని భగవంతుడే కాపాడారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారని మేఘా తెలిపారు. బహుశా అది కూడా నిజమే కావచ్చని ఆమె పేర్కొన్నారు.

ADVERTISEMENT