LOADING...
US-Venezuelan: ట్రంప్‌ హెచ్చరికల నడుమ వెనిజులాలో పేలుళ్లు.. కారకాస్‌లో కలకలం
ట్రంప్‌ హెచ్చరికల నడుమ వెనిజులాలో పేలుళ్లు.. కారకాస్‌లో కలకలం

US-Venezuelan: ట్రంప్‌ హెచ్చరికల నడుమ వెనిజులాలో పేలుళ్లు.. కారకాస్‌లో కలకలం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను పదవి నుంచి తప్పుకోవాలని గత కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్‌ బెదిరింపులను మదురో లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కారకాస్‌పై అమెరికా దాడులు నిర్వహించినట్లు సమాచారం. నగరంలోని దాదాపు ఏడుచోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లతో ఆకాశమంతా పొగ కమ్ముకోవడం కలకలం రేపింది. అదే సమయంలో తక్కువ ఎత్తులో ఎగిరే విమానాల శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వీధుల్లో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Advertisement