Loading...
F-35B Stealth Fighter: అమెరికాలో కుప్పకూలిన ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైటర్‌.. పైలట్‌ సురక్షితం, వీడియో వైరల్
అమెరికాలో కుప్పకూలిన ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైటర్‌.. పైలట్‌ సురక్షితం, వీడియో వైరల్

F-35B Stealth Fighter: అమెరికాలో కుప్పకూలిన ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైటర్‌.. పైలట్‌ సురక్షితం, వీడియో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 01, 2026
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటైన ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైటర్ (F-35B Stealth Fighter) కూలిపోయింది. ఈ ఘటన కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ డియాగోలో ఉన్న మిరామర్ ఎయిర్‌బేస్ సమీపంలో చోటుచేసుకుంది. అయితే ప్రమాదానికి ముందు పైలట్ పారాచూట్ సాయంతో విమానం నుంచి బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. పారాచూట్‌తో బయటపడ్డ పైలట్ విమానం కూలే క్షణాల్లోనే పైలట్ అత్యవసరంగా ఎజెక్ట్‌ అయి పారాచూట్ సాయంతో సురక్షితంగా నేలపైకి దిగాడు. ప్రస్తుతం అతడికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అమెరికా మెరైన్ కార్ప్స్ వెల్లడించింది.

వివరాలు

భారీ మంటలు.. దట్టమైన పొగ

విమానం కూలిన వెంటనే అక్కడ భారీ పేలుడు సంభవించి దట్టమైన నల్లటి పొగ, మంటలు ఎగసిపడ్డాయి.

ఈ దృశ్యాలు వీడియోల్లో నమోదయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న సైనిక సిబ్బంది, అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాయి.

వివరాలు

ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే..

ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. రెండు యుద్ధ విమానాలు రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో మొదటి విమానం సురక్షితంగా దిగింది.

రెండో ఎఫ్‌-35బీ మాత్రం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. భూమికి సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండగా పైలట్ ఎజెక్ట్ అయ్యాడు.

అనంతరం విమానం మరో విమానం సమీపంలో కూలిపోయింది. ఇక రన్‌వేపై పడిన కొద్దిసేపటికే స్టీల్త్ ఫైటర్ పేలిపోయిందని శాన్ డియాగో అగ్నిమాపక శాఖ ప్రతినిధి కాండేస్ హాడ్లే తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

కీలక శిక్షణ కేంద్రం

శాన్ డియాగోలోని మిరామర్ ఎయిర్‌బేస్ అమెరికా నేవీ ఫైటర్ పైలట్ల శిక్షణకు కీలక కేంద్రంగా ఉంది. ఈ ఎయిర్‌బేస్‌ను అమెరికా మెరైన్ కార్ప్స్ కూడా వినియోగిస్తోంది.

అమెరికా వద్ద 630కి పైగా ఎఫ్‌-35లు

2024 ప్రభుత్వ గణాంకాల ప్రకారం అమెరికా మెరైన్ కార్ప్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిపి 630కి పైగా ఎఫ్‌-35 యుద్ధ విమానాలను వినియోగిస్తున్నాయి.

కాగా, ఒక ఎఫ్‌-35బీ స్టీల్త్ ఫైటర్ ధర సుమారు 109 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.900 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా.

ADVERTISEMENT