తదుపరి వార్తా కథనం
ట్విట్టర్ లోకి లాగిన్ అయిన జుకర్ బర్గ్: థ్రెడ్ యాప్ ప్రచారం కోసమేనా?
వ్రాసిన వారు
Sriram Pranateja
Jul 06, 2023
12:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, తాజాగా ట్విట్టర్ లోకి లాగిన్ అయ్యాడు. దాదాపు 11ఏళ్ల తర్వాత ట్విట్టర్ లో మార్క్ వచ్చాడు.
అయితే ట్విట్టర్ లో మార్క్ అప్లోడ్ చేసిన పోస్ట్, ఆసక్తికరంగా ఉంది. స్పైడర్ మ్యాన్ గెటప్ లో రెండు కార్టూన్ బొమ్మలు, ఒకదానినొకటి చేత్తో చూపించుకుంటూ ఉన్నాయి.
అంటే నువ్వూ నేను ఒకేలా ఉన్నామని అవి చూపించుకున్నట్టుగా ఆ ఫోటో కనిపిస్తోంది. మరి మార్క్ అలా పెట్టడానికి కారణమేంటో తెలియదు.
ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్ యాప్ ని మెటా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. థ్రెడ్ యాప్ ప్రమోషన్ కోసమే మార్క్ అలా పోస్ట్ పెట్టారని నెటిజన్లు అనుకుంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ట్విట్టర్ లోకి లాగిన్ అయిన జుకర్ బర్గ్
— Mark Zuckerberg (@finkd) July 6, 2023