Loading...
Fazlur Rehman: 'యూనిఫాం తీసి ఎన్నికల్లో పోటీ చేయండి': పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్'కి జేఎయూఐ అధినేత సవాల్
పాక్ సైన్యంపై విరుచుకుపడ్డ ఫజ్లూర్ రెహ్మాన్

Fazlur Rehman: 'యూనిఫాం తీసి ఎన్నికల్లో పోటీ చేయండి': పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్'కి జేఎయూఐ అధినేత సవాల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
03:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో రోజురోజుకూ అంతర్గత పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, దేశం క్రమంగా విచ్ఛిన్నమవుతోందని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లామ్ (జేఎయూఐ) అధినేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, దేశ రక్షణ బాధ్యత సాధారణ ప్రజలది కాదని, సైన్యానిదేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ భద్రతా పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు. బలూచిస్థాన్‌లో ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని ఫజ్లూర్ రెహ్మాన్ అన్నారు. గతంలో బలూచ్ ప్రాంతాల్లో హింసపై ఆందోళన వ్యక్తం చేశామని, ఇప్పుడు పశ్తూన్ ప్రాంతాలు కూడా రక్తపాతంతో తడిసిపోతున్నాయని పేర్కొన్నారు. కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలోనే పశ్తూన్ ప్రాంతాల్లో 50 మందికి పైగా మరణించారని తెలిపారు.

వివరాలు 

ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం,కూల్చివేయడం సైన్యం పని కాదు 

ఈ సందర్భంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ జనరల్ అసీమ్ మునీర్‌ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు గుప్పించారు.

సైన్యం రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటే ముందుగా యూనిఫాం విప్పి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.

అప్పుడు ప్రజల్లో తమకు ఎంత ఆదరణ ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం,కూల్చివేయడం సైన్యం పని కాదని,ప్రజలే తమ నాయకులను ఎన్నుకోవాలని అన్నారు.

ఫజ్లూర్ రెహ్మాన్ వ్యాఖ్యలు వెలువడిన సమయంలో బలూచిస్థాన్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా ఉన్నాయి.

మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ మహ్రంగ్ బలూచ్ సహా పలువురిపై చర్యలు కొనసాగుతుండగా, తిరుగుబాటు దారుల దాడులు కూడా పెరుగుతున్నాయి.

వివరాలు 

114 మంది మిలిటెంట్లు హతం 

ఇటీవల ఓ పోలీస్ చెక్‌పోస్టుపై దాడి అనంతరం 18 మంది పోలీసులను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది.

మరో ఘటనలో హైవేపై జరిగిన దాడిలో 11 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దాడుల అనంతరం బలూచిస్థాన్‌లో భద్రతా బలగాలు విస్తృత స్థాయిలో ఆపరేషన్లు చేపట్టాయి.

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ ప్రకారం ఇప్పటివరకు 114 మంది మిలిటెంట్లు హతమయ్యారు.

మరోవైపు ప్రధానమంత్రి షెహ్‌బాజ్ షరీఫ్, అసీమ్ మునీర్, బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తితో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలూచిస్థాన్‌లలో జరిగే దాడులకు ఆఫ్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

2026లో 650 హింసాత్మక ఘటనలు

పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో గణాంకాలు కూడా చెబుతున్నాయి.

సౌత్ ఏషియా టెర్రరిజం పోర్టల్ సమాచారం ప్రకారం 2026లో ఇప్పటివరకు 650 హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి.

వీటిలో 487 మంది పౌరులు, 730 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,200 మంది మిలిటెంట్లు హతమైనట్లు పేర్కొంది.

ఇదిలా ఉండగా, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoJK)లో కూడా పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి.

జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC)పై నిషేధం విధించడంతో ప్రారంభమైన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి.

సంస్థ చేసిన 38 డిమాండ్లలో పాకిస్థానీయుల ఆధిపత్యంలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలను రద్దు చేయాలని కూడా కోరుతోంది.

రావలకోట్ ఈద్గాహ్ మైదానంలో వేలాది మంది నిరసనకారులు దీక్ష కొనసాగిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

జూలై 15న ముజఫరాబాద్ వరకు భారీ లాంగ్ మార్చ్ చేయనున్న జేఏఏసీ

ఇటీవల బాఘ్ అర్జా జండాలా ప్రాంతంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు స్థానిక నివేదికలు తెలిపాయి.

ప్రాథమిక హక్కులు, ఆర్థిక ఉపశమనం, రాజకీయ స్వేచ్ఛల కోసం ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు.

ఇదే సమయంలో జేఏఏసీ జూలై 15న ముజఫరాబాద్ వరకు భారీ లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించి, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

ఆఫ్ఘానిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దేశంలో ప్రతిపక్షాలు, పౌర సమాజ సంస్థలతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం, బలూచిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పెరుగుతున్న అసంతృప్తి వంటి పరిణామాలు చూస్తే పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభం త్వరలో ముగిసే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న జేఎయూఐ అధినేత ఫజ్లూర్ రెహ్మాన్

ADVERTISEMENT