
2023లో అందించే నోబెల్ బహుమతి విజేతలకు ప్రైజ్ మనీ భారీ పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
2023లో నోబెల్ బహుమతి విజేతలకు అందించే నగదు ప్రోత్సహాకాన్ని పెంచారు. దాదాదపు 1మిలియన్ స్వీడీష్ క్రౌన్స్( స్వీడన్ కరెన్సీ)ను పెంచినట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం తెలిపింది.
దీంతో నోబెల్ విజేతలకు అందించే మొత్త ప్రైజ్ మనీ 11మిలియన్ స్వీడిష్ క్రౌన్స్ (9,86,000 డాలర్లు)కు చేరుకుంది.
ప్రైజ్ మనీని ఇటీవలి సంవత్సరాల్లో కొన్ని సార్లు తగ్గించడం, పెంచడం చేశారు. అయితే ఈ ఏడాది మాత్రం ఫౌండేషన్ బలమైన ఆర్థిక స్థితిని ప్రతిబింబించేలా భారీ మొత్తంలో పెంచుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
2012లో ప్రైజ్ మనీ 10మిలియన్ల క్రౌన్స్ నుంచి 8మిలియన్లకు తగ్గించారు. 2017లో దాన్ని 9మిలియన్ల క్రౌన్స్‌కు పెంచారు. 2020లో 10మిలియన్ల క్రౌన్స్ పెంచారు.
గత దశాబ్దంలో యూరోతో పోలిస్తే క్రౌన్ విలువలో 30%కోల్పోవడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
11 మిలియన్ క్రౌన్స్‌కు చేరిన ప్రైజ్ మనీ
Nobel Prize award raised to nearly $1 million for 2023 https://t.co/UFJERDKE3h pic.twitter.com/J19O1L4MMY
— Reuters (@Reuters) September 15, 2023