LOADING...
Sheikh Hasina: తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి  నెట్టేశారు: షేక్‌ హసీనా 
తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి నెట్టేశారు: షేక్‌ హసీనా

Sheikh Hasina: తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి  నెట్టేశారు: షేక్‌ హసీనా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశాన్ని అంధకారంలోకి నెట్టేసిందని ఆమె విమర్శించారు. నూతన సంవత్సర సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి ఆమె ఒక సందేశం విడుదల చేశారు, దీన్ని ఆమె పార్టీ అవామీ లీగ్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దేశాన్ని ధ్వంసం చేయడానికి కుట్రలు పన్నిన వారి ముఖాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయని, అక్రమ దోపిడీదారులు ప్రజలను బందీలుగా మార్చారని హసీనా పేర్కొన్నారు.

వివరాలు 

పరిస్థితులు మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది: హసీనా  

తాత్కాలిక ప్రభుత్వం అపరిమిత అవినీతి,వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేశాన్ని చీకటిలోకి నెట్టేసిందని ఆరోపించారు. కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు,భద్రతా సమస్యల కారణంగా విదేశీ పెట్టుబడిదారులు దేశంపై ఆసక్తి చూపడంలేదని, దీంతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడినట్లు వివరించారు. పరిస్థితులు మరింత దిగజారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హసీనా సూచించారు. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్న నేపథ్యంలో దేశాన్ని రక్షించుకోవడానికి బంగ్లాదేశ్ ప్రజలందరూ ఐక్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశం భయ గుప్పిట్లో ఉందని,ఇతర దేశాలు బంగ్లాదేశ్‌ను గౌరవంతో చూడడం లేదని ఆమె తెలిపారు. గతంలో, వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కలిసిమెలిసి జీవించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అవామీ లీగ్‌ ఎక్స్‌లో చేసిన పోస్ట్ 

Advertisement