Page Loader
Israel-Hamas: 477 రోజుల తర్వాత హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీలకు విముక్తి
477 రోజుల తర్వాత హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీలకు విముక్తి

Israel-Hamas: 477 రోజుల తర్వాత హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీలకు విముక్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాజా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో భాగంగా శనివారం హమాస్‌, నలుగురు మహిళా బందీలను విడుదల చేసింది. విడుదలైన వారిలో కరీనా అరీవ్, డానియెల్‌ గిల్‌బోవా, నామా లెవి, లిరి అల్బాజ్‌ ఉన్నారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్‌ 100కి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. ఈ మహిళా బందీలు గాజా సరిహద్దు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్‌ నుంచి 2023 అక్టోబర్ 7న హమాస్‌ చెరలోకి తీసుకువెళ్లారు. 477 రోజులపాటు బందీలుగా ఉన్న వారిని తాజాగా మిలిటరీ యూనిఫామ్‌లో రెడ్‌క్రాస్‌కు అప్పగించగా, వారిని ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లే వాహనం గాజాను వదిలింది.

Details

1,700 మంది పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్‌ విముక్తి

ఈ సమాచారాన్ని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజున, ముగ్గురు మహిళా బందీలను హమాస్‌ విడుదల చేయగా, ప్రతిగా ఇజ్రాయెల్‌ 100కు పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. 42 రోజులపాటు కొనసాగనున్న ఈ ఒప్పందంలో హమాస్‌ చెరలో ఉన్న 94 మంది ఇజ్రాయెల్‌ బందీల్లో 33 మందిని విడుదల చేస్తుందని హమాస్‌ తెలిపింది. ప్రతిగా, దాదాపు 1,700 మంది పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్‌ విముక్తి కల్పించనుంది.