LOADING...
France: ఫ్రాన్స్‌లో తీవ్ర ఎండల ప్రభావం.. వారం రోజుల్లో వెయ్యి మంది మృతి
ఫ్రాన్స్‌లో తీవ్ర ఎండల ప్రభావం.. వారం రోజుల్లో వెయ్యి మంది మృతి

France: ఫ్రాన్స్‌లో తీవ్ర ఎండల ప్రభావం.. వారం రోజుల్లో వెయ్యి మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అసాధారణ వేడి కారణంగా ఫ్రాన్స్‌లో గత వారం రోజుల్లో సుమారు వెయ్యి అదనపు మరణాలు నమోదైనట్లు ఆ దేశ ప్రజారోగ్య సంస్థ ఆదివారం వెల్లడించింది. ఇవి సాధారణంగా ప్రతిరోజూ నమోదయ్యే మరణాలకు అదనంగా సంభవించినవని స్పష్టం చేసింది. మరోవైపు, తీవ్ర ఎండల ప్రభావంతో జర్మనీలో పలు ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. దేశ తూర్పు ప్రాంతమైన సక్సనీలోని కూబ్‌షూట్స్‌లో రాత్రి ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 29.4 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. అలాగే మోకెర్న్‌ డ్రీవిజ్‌లో పగటి ఉష్ణోగ్రత 41.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదై కొత్త రికార్డు సృష్టించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అధిక ఉష్ణోగ్రతలతో ఫ్రాన్స్‌లో వెయ్యి మంది మృతి

Advertisement