Egypt: ఈజిప్టులో ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 31 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఈజిప్ట్ రాజధాని కైరోలోని రద్దీగా ఉండే ఓ హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడి పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది గాయపడ్డారు. వరాఖ్ ప్రాంతంలోని రింగ్ రోడ్డు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తొలుత చమురు ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. దీంతో అందులోని పెట్రోల్ రోడ్డుపైకి లీకై సమీపంలో ఉన్న ఇతర వాహనాల వద్దకు కూడా చేరింది. అదే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ వివరాలను ఈజిప్టు ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.
వివరాలు
హైటెన్షన్ విద్యుత్తు వైరు తెగిపడటంతో ప్రమాదం
ఈజిప్టులోని ఓ ప్రైవేటు కాంట్రాక్టర్‌కు చెందిన పెట్రోల్ ట్యాంకర్ హైవేపై ప్రయాణిస్తుండగా హైటెన్షన్ విద్యుత్తు కేబుల్ తెగి దాని ముందు పడింది.
దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి ట్యాంకర్ బోల్తాపడినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి.
అయితే అప్పటికే 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు తగ్గిన తర్వాత భారీ సంఖ్యలో ప్రజలు హైవేపైకి చేరుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
వివరాలు
హైటెన్షన్ విద్యుత్తు వైరు తెగిపడటంతో ప్రమాదం
జనం గుమిగూడటంతో సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకోవడం కూడా కష్టంగా మారింది.
ఈజిప్టులో రహదారుల నిర్వహణ సరిగా లేకపోవడం, అక్రమ నివాసాలు, కాలం చెల్లిన మౌలిక సదుపాయాలు తరచూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ఈ సమస్యల కారణంగా అక్కడ రహదారి ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
గతేడాది ఈజిప్టులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 6,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా కైరోలో జరిగిన ట్యాంకర్ పేలుడు మరోసారి అక్కడి రహదారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హైటెన్షన్ వైరు తెగిపడటంతో బోల్తాపడిన ట్యాంకర్
🚨🇪🇬 Dramatic footage captures the moment a 𝐟𝐮𝐞𝐥 𝐭𝐚𝐧𝐤𝐞𝐫 𝐨𝐯𝐞𝐫𝐭𝐮𝐫𝐧𝐞𝐝 𝐚𝐧𝐝 𝐞𝐱𝐩𝐥𝐨𝐝𝐞𝐝 𝐨𝐧 𝐂𝐚𝐢𝐫𝐨’𝐬 𝐑𝐢𝐧𝐠 𝐑𝐨𝐚𝐝 𝐢𝐧 𝐆𝐢𝐳𝐚, engulfing more than two dozen vehicles in flames.
— Rula El Halabi (@Rulaelhalabi) November 25, 2026
At least 31 people were reportedly killed and 21 injured.… pic.twitter.com/1yqfkO1Dsw