LOADING...
Cuba: ఇంధనం 'సున్నా'.. ఆహారం కొరత.. క్యూబాలో మానవతా సంక్షోభం
ఇంధనం 'సున్నా'.. ఆహారం కొరత.. క్యూబాలో మానవతా సంక్షోభం

Cuba: ఇంధనం 'సున్నా'.. ఆహారం కొరత.. క్యూబాలో మానవతా సంక్షోభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

లాటిన్ అమెరికాకు చెందిన క్యూబా తన చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. యునైటెడ్ స్టేట్స్ విధిస్తున్న ఆంక్షలు కేవలం ఆర్థిక రంగానికే పరిమితం కాకుండా, ఇప్పుడు ఇంధనం, ఆహారం, ప్రజారోగ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆంక్షలను డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం 2026లో మరింత కఠినతరం చేయడంతో క్యూబాలో జనజీవనం దాదాపు స్తంభించింది.

Details

అమెరికా ముప్పేట దాడి

2026 జనవరిలో ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ క్యూబాకు భారీ దెబ్బతీసింది. క్యూబాతో వ్యాపారం చేసే లేదా చమురు సరఫరా చేసే దేశాలపై అధిక సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తామని అమెరికా హెచ్చరించింది. వెనిజులా నుంచి సరఫరా నిలిచింది వెనిజులాలో అమెరికా సైనిక చర్యల అనంతరం అక్కడి నుంచి క్యూబాకు వస్తున్న చమురు పూర్తిగా ఆగిపోయింది. మెక్సికో వెనకడుగు మెక్సికో చమురు సరఫరా చేయడానికి ప్రయత్నించినా, అమెరికా టారిఫ్‌ల హెచ్చరికల కారణంగా ఆ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో క్యూబాకు చేరాల్సిన ఇంధనం పూర్తిగా 'సున్నా' స్థాయికి పడిపోయింది.

Details

వీధుల్లో చెత్త.. ఆసుపత్రుల్లో అవస్థలు

ఇంధన కొరత రాజధాని హవానాలో తీవ్రమైన ప్రభావం చూపుతోంది. చెత్త సేకరణ నిలిచిపోయింది హవానాలో ఉన్న 106 గార్బేజ్ ట్రక్కుల్లో కేవలం 44 మాత్రమే నడుస్తున్నాయి. ఫలితంగా వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి అంటువ్యాధుల ముప్పు పెరిగింది. విద్యుత్ కోతలు చమురు కొరతతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిలిచిపోవడంతో రోజుకు 12 నుంచి 20 గంటలపాటు బ్లాకౌట్‌లు కొనసాగుతున్నాయి. ఆహార భద్రత సంక్షోభం ఐక్యరాజ్యసమితికి చెందిన World Food Programme (WFP) కార్యకలాపాలు కూడా ఇంధనం లేక నిలిచిపోయాయి. నగరాలకు తాజా కూరగాయలు, నిత్యావసర సరుకులు చేరడం కష్టమైంది.

Advertisement

Details

ట్రంప్ హెచ్చరిక

క్యూబాను 'ఫెయిల్డ్ నేషన్'గా పేర్కొన్న ట్రంప్, అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం దిగివచ్చి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని డిమాండ్ చేశారు. "క్యూబా త్వరలోనే కూలిపోతుంది. మీరు చర్చలకు వస్తారని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. అయితే, క్యూబా ప్రభుత్వం దీనిని 'ఆర్థిక ఉగ్రవాదం'గా అభివర్ణించింది. ఇతర దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని అడ్డుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇది క్యూబా ప్రజలపై సామూహిక శిక్షగా మారిందని విదేశాంగ శాఖ మండిపడింది. అంతర్జాతీయ స్పందన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నిపుణులు అమెరికా చర్యలను ఖండించారు. ఇంధనం, ఆహారం, ఔషధాల సరఫరా నిలిచిపోవడం వల్ల సామాన్య ప్రజలు—ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధులు—తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement