Venezuela: గ్యాస్, గోల్డ్, ఐరన్ ఓర్… వెనెజువెలాలో వాస్తవ సంపద తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
చమురు, గ్యాస్ మాత్రమే కాదు... వెనెజువెలా భూమిలో అపారమైన సహజ వనరులు దాగి ఉన్నాయనే అంశం తాజాగా మరోసారి అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. నివేదికల ప్రకారం, వెనెజువెలాకు సుమారు 4 బిలియన్ టన్నుల ఇనుప ఖనిజ (ఐరన్ ఓర్) నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే 12వ అతిపెద్ద ఐరన్ ఓర్ నిల్వగా గుర్తింపు పొందింది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వీటి విలువ 400బిలియన్ డాలర్లకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, శనివారం అమెరికా సైన్యం వెనెజువెలా రాజధాని కారకాస్‌పై దాడి చేసి, అధ్యక్షుడు నికోలాస్ మడురోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పలు ఆరోపణల నేపథ్యంలో వారిని అమెరికాకు తరలించి అక్కడ విచారణ చేపట్టనున్నట్లు వెల్లడైంది.
Details
చమురు మౌలిక సదుపాయాలపై అమెరికా నియంత్రణ
ఈ పరిణామంతో వెనెజువెలాలోని సహజ వనరుల మౌలిక వసతులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వెనెజువెలా సంపద చమురుతో మాత్రమే పరిమితం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దేశంలో చమురు, సహజ వాయువు, బంగారం, ఐరన్ ఓర్, అరుదైన భూలోహాలు (రేర్ ఎర్త్ మినరల్స్) వంటి విలువైన వనరులు విస్తారంగా ఉన్నాయి. ముఖ్యంగా చమురు మౌలిక సదుపాయాలపై అమెరికా నియంత్రణ సాధించినట్లు వాషింగ్టన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా నిర్ధారిత హైడ్రోకార్బన్ నిల్వలు వెనెజువెలాకే ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క చమురే సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల నిల్వలు కలిగి ఉందని అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వగా పరిగణిస్తారు.
Details
చమురు సంపద విలువ దాదాపు 17 ట్రిలియన్ డాలర్లు
ప్రస్తుత ధరల ప్రకారం ఈ చమురు సంపద విలువ దాదాపు 17 ట్రిలియన్ డాలర్లుగా లెక్కిస్తున్నారు. అయితే అమెరికా విధించిన ఆంక్షలు, ముఖ్యంగా చావిస్మో పాలనపై అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా, వెనెజువెలా చమురు ఉత్పత్తి ప్రస్తుతం ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో కేవలం 1 శాతం మాత్రమే ఉందని నివేదికలు చెబుతున్నాయి. క్రూడ్ ఆయిల్‌తో పాటు, వెనెజువెలా శక్తి నిల్వల్లో సహజ వాయువు కూడా కీలకంగా ఉంది. దేశంలో దాదాపు 200 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ల సహజ వాయు నిల్వలు ఉన్నట్లు అంచనా. ప్రస్తుత ధరల ప్రకారం వీటి విలువ 800 బిలియన్ డాలర్లకు మించిగా ఉంది. హైడ్రోకార్బన్లతో పాటు, వెనెజువెలాలో బంగారం, అరుదైన ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి.
Details
వెనెజువెలాలో ఇంకా బొగ్గు, నికెల్, కాపర్, ఫాస్ఫేట్ వంటి ఖనిజ నిల్వలు
ఆధునిక సాంకేతిక రంగాలకు కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఈ దేశంలో లభిస్తున్నాయి. ఇదే కాకుండా వెనెజువెలాకు చెందిన 4 బిలియన్ టన్నుల ఐరన్ ఓర్ నిల్వలు మరో కీలక ఆర్థిక వనరుగా నిలుస్తున్నాయి. వెనెజువెలా వద్ద ప్రస్తుతం 161 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 22బిలియన్ డాలర్లగా అంచనా వేస్తున్నారు. బంగారం ధరలో ప్రతి 100 డాలర్ల పెరుగుదల దేశపు బంగారు సంపద విలువను 500మిలియన్ డాలర్లు పెంచుతుందన్నది గమనార్హం. వెనెజువెలాలో ఇంకా వినియోగంలోకి రాని బొగ్గు, నికెల్, కాపర్, ఫాస్ఫేట్ వంటి ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఈ ఖనిజ సంపద అంతా ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక అంశంగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.