Page Loader
Bangladesh: బంగ్లాదేశ్‌కు నిధులు నిలిపేసిన ట్రంప్.. యూనస్‌తో భేటీ అయిన జార్జిసోరస్‌ కుమారుడు..! 
బంగ్లాదేశ్‌కు నిధులు నిలిపేసిన ట్రంప్.. యూనస్‌తో భేటీ అయిన జార్జిసోరస్‌ కుమారుడు..!

Bangladesh: బంగ్లాదేశ్‌కు నిధులు నిలిపేసిన ట్రంప్.. యూనస్‌తో భేటీ అయిన జార్జిసోరస్‌ కుమారుడు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

వివాదాస్పద అమెరికన్‌ బిలియనీర్‌, ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ (OSF) అధినేత జార్జి సోరస్‌ కుమారుడు అలెక్స్‌ బంగ్లాదేశ్‌ ప్రధాన సలహాదారైన మహమ్మద్‌ యూనస్‌తో భేటీ అయ్యారు. ట్రంప్‌ ప్రభుత్వం బంగ్లాదేశ్‌ సహా కొన్ని దేశాలకు ఆర్థిక సాయం నిలిపేసిన నిర్ణయం తీసుకున్న తీసుకొన్నాక ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. మూడు నెలల వ్యవధిలో ఇది వీరిద్దరి మధ్య రెండవ భేటీ. ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌కు చెందిన కీలక వ్యక్తులు యూనస్‌ అధికారిక చీఫ్‌ ఇంటీరియం అడ్వైజర్‌తో సమావేశం జరిగిందని యూనస్‌ ఆఫీస్‌ తన ఎక్స్‌ ప్రొఫైల్‌లో పేర్కొంది.

వివరాలు 

రోహింగ్యా సంక్షోభంపై చర్చ 

''బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే దానిపై, అసత్య ప్రచారాలతో ఎలా పోరాడాలో, ముఖ్య ఆర్థిక సంస్కరణల గురించి చర్చించాం'' అని ఆఫీస్‌ వెల్లడించింది. రోహింగ్యా సంక్షోభం వంటి అంశాలపై కూడా వారు చర్చించినట్లు స్థానిక మీడియా తెలిపింది. సోరస్‌కు చెందిన ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ మార్పులు ప్రోత్సహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, తూర్పు ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్‌ అమెరికాలోని కొన్ని దేశాలలో వారి పాత్ర పై వదంతులు ప్రచారంలో ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వ పతనంలో కూడా ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్‌ కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది.

వివరాలు 

ఆసియాలోనే యూఎస్‌ ఎయిడ్‌ అత్యధిక సాయం బంగ్లాదేశ్‌కు..

అమెరికా సంయుక్త రాష్ట్రాల యూఎస్‌ ఎయిడ్‌ సంస్థ వివిధ దేశాలకు అందించే సాయం 90 రోజులపాటు నిలిపివేసింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌ కూడా ఉంది. ఈ పరిణామం వల్ల యూనస్‌ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆసియాలోనే యూఎస్‌ ఎయిడ్‌ అత్యధిక సాయం బంగ్లాదేశ్‌కు అందుతోంది. ఆహార భద్రత, ఆరోగ్యం, పాలన, విద్య, పర్యావరణం వంటి రంగాలలో ఈ సాయాన్ని వినియోగించేవారు. 2024లో అమెరికా నుండి బంగ్లాదేశ్‌కు 202 మిలియన్‌ డాలర్లు అందాయి.