Nicolas Maduro: సంకెళ్లతోనే గుడ్‌నైట్.. హ్యాపీ న్యూ ఇయర్: యూఎస్ అధికారులతో మదురో వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి యునైటెడ్ స్టేట్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం న్యూయార్క్ నగరంలోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) కేంద్రానికి మదురోను తరలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మదురో చేతులకు సంకెళ్లు వేసిన ఫొటోలు, వీడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులో ఇద్దరు డీఈఏ అధికారులు మదురోను అదుపులోకి తీసుకుని తరలిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా తనతో ఉన్న అమెరికా అధికారులతో మదురో సంభాషించినట్లు వీడియోలో కనిపించింది.
Details
నిర్బంధానికి సంబంధించిన దృశ్యాలు వైరల్
వారిని ఉద్దేశిస్తూ 'గుడ్‌నైట్' అని చెప్పడంతో పాటు, నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు. మదురో చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వేగంగా వైరల్‌గా మారింది. అమెరికా సైన్యం చేపట్టిన ఈ చర్యలు, మదురో నిర్బంధానికి సంబంధించిన దృశ్యాలు అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Nicolas Maduro arriving to the DEA offices in New York:
— Pop Base (@PopBase) January 4, 2026
“Happy new year”
pic.twitter.com/POOgajtQvc