LOADING...
Green cards: గ్రీన్ కార్డులు ప్రమాదంలో ఉన్నాయా? SNAP, మెడికెయిడ్ తీసుకుంటే కష్టమేనా? ఇమ్మిగ్రెంట్లలో ఆందోళన
SNAP, మెడికెయిడ్ తీసుకుంటే కష్టమేనా? ఇమ్మిగ్రెంట్లలో ఆందోళన

Green cards: గ్రీన్ కార్డులు ప్రమాదంలో ఉన్నాయా? SNAP, మెడికెయిడ్ తీసుకుంటే కష్టమేనా? ఇమ్మిగ్రెంట్లలో ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో గ్రీన్‌కార్డ్ ప్రాసెస్ మరోసారి కఠినంగా మారే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన కొత్త రూల్స్ ప్రకారం, SNAP ఫుడ్ బెనిఫిట్స్, మెడికెయిడ్ వంటి ప్రభుత్వ సేవలను వాడుతున్న ఇమ్మిగ్రెంట్లకు గ్రీన్‌కార్డ్ ఇవ్వడంలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రపోజల్ ఫెడరల్ రిజిస్టర్‌లో బుధవారం ప్రచురించగా,హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ దీనిని ఈ వారం ప్రారంభంలోనే విడుదల చేసింది. అమెరికాలో ఉన్న విదేశీయులు ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలని, బెనిఫిట్స్ ఇమ్మిగ్రేషన్‌ను ప్రోత్సహించేలా ఉండకూడదని ఈ ప్రపోజల్ పేర్కొంది.

వివరాలు 

ఈ సేవలు ఇప్పుడు కూడా అందుబాటులో లేవు

అయితే ట్రంప్ అనుచరులు, రిపబ్లికన్లు పలువురు ఇమ్మిగ్రెంట్లు సామాజిక సేవా పథకాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తుండగా, విమర్శకులు మాత్రం ఈ కొత్త రూల్ స్పష్టత లేకుండా ఉండడం వల్ల అవసరమున్న, అర్హత ఉన్న ఇమ్మిగ్రెంట్లు కూడా బెనిఫిట్స్ వాడడానికి భయపడే పరిస్థితి వస్తుందని అంటున్నారు. లీగల్ స్టేటస్ లేని వారికి SNAP, మెడికెయిడ్ వంటి సేవలు ఇప్పుడు కూడా అందుబాటులో లేవు. అయినా, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ శరణార్థులు సహా పలు రకాల హ్యూమానిటేరియన్ రక్షణ పొందిన లా-ఫుల్ ఇమ్మిగ్రెంట్లపైనా బెనిఫిట్స్ పరిమితులు మరింత పెంచింది. రాష్ట్రాలు తమ సొంత నిధులతో పౌరసత్వం సంబంధం లేకుండా హెల్త్‌కేర్ అందించినా, ఆ రాష్ట్రాలకు వచ్చే ఫెడరల్ నిధులను కూడా తగ్గించారు.

వివరాలు 

జో బైడెన్ ప్రభుత్వం 2022లో ఈ రూల్‌ను రద్దు చేసింది

తాజా ప్రపోజల్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న బెనిఫిట్స్‌ను కూడా ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుల పరిశీలనలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. 2019లో ట్రంప్ ప్రభుత్వం పబ్లిక్ ఛార్జ్ నిబంధనలను విస్తరించి, మరికొన్ని బెనిఫిట్స్‌ను కూడా జాబితాలో చేర్చి, శాశ్వత నివాసం పొందడం కష్టతరం చేసింది. అయితే జో బైడెన్ ప్రభుత్వం 2022లో ఈ రూల్‌ను రద్దు చేసింది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రపోజల్ బైడెన్ తీసుకువచ్చిన రక్షణలను తొలగించి, డీఎచ్ఎస్‌కు(DHS) మరింత స్వయంచాలక అధికారాలు ఇచ్చేలా, పబ్లిక్ సర్వీస్ ప్రోగ్రాంల వినియోగాన్ని ఆధారంగా తీసుకుని గ్రీన్‌కార్డ్ దరఖాస్తులను తిరస్కరించే అవకాశం పెంచుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.