LOADING...
Donald Trump: నచ్చినా నచ్చకపోయినా గ్రీన్‌లాండ్‌ అమెరికాదే : ట్రంప్‌ హెచ్చరిక
నచ్చినా నచ్చకపోయినా గ్రీన్‌లాండ్‌ అమెరికాదే : ట్రంప్‌ హెచ్చరిక

Donald Trump: నచ్చినా నచ్చకపోయినా గ్రీన్‌లాండ్‌ అమెరికాదే : ట్రంప్‌ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్‌ను ఏ మార్గంలోనైనా అయినా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. అక్కడి ప్రజలకు ఇది నచ్చినా.. నచ్చకపోయినా ఈ విషయంలో అమెరికా ముందడుగు వేస్తుందని అన్నారు. ఒకవేళ అలా జరగకపోతే, ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉందని ఆరోపించారు. రష్యా, చైనాలు తమకు పొరుగు దేశాలుగా ఉండటాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ కోరుకోవడం లేదని ట్రంప్‌ తెలిపారు.

Details

గ్రీన్‌లాండ్‌ విషయంలో కఠిన నిర్ణయాలు

ఈ నేపథ్యంలోనే గ్రీన్‌లాండ్‌ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్నారు. తొలుత చర్చలు, సంప్రదింపుల ద్వారా గ్రీన్‌లాండ్‌ను పొందాలని భావించామని చెప్పారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇక కఠిన మార్గాలను అనుసరించాల్సి వస్తుందని వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

Advertisement