Mexico: మెక్సికోలో కాల్పుల కలకలం.. చిన్నారితో సహా 10 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మెక్సికోలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్‌విట్టింగ్ ప్రాంతంలో ఆదివారం ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడి వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇదే మూడో పెద్ద కాల్పుల ఘటన అని అధికారులు గుర్తు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మహిళలు, చిన్నారి సహా 10 మంది బలి
México: al menos 10 muertos en ataque armado en Puebla
— DW Español (@dw_espanol) May 17, 2026
Hombres armados ingresaron a una vivienda y atacaron a una familia. Entre las víctimas hay una recién nacida. Las fuerzas de seguridad se desplegaron para dar con los responsables. https://t.co/eEzwHsjSvb (dz)
వివరాలు
ఫిఫా ప్రపంచకప్‌కు సహ ఆతిథ్యం ఇవ్వనున్న మెక్సికో
గత ఫిబ్రవరిలో హహ ఎలాన్ ఎల్ గ్రాండే నగరంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించగా, కొన్ని రోజులకే ప్యూబ్లా రాజధానిలో వాహనంపై జరిగిన దాడిలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మధ్య మెక్సికో ప్రాంతంలో హింసాత్మక ఘటనలు రోజురోజుకు పెరుగుతుండటంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పరిస్థితులు విషమించడంతో దాదాపు వెయ్యి కుటుంబాలు తమ ఇళ్లను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మరికొద్ది రోజుల్లో మెక్సికో ఫిఫా ప్రపంచకప్‌కు సహ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం ప్రకటించింది.