LOADING...
Nigeria: నైజీరియాలో మారణహోమం.. రెండు గ్రామాల్లో 200 మంది ఊచకోత..!
నైజీరియాలో మారణహోమం.. రెండు గ్రామాల్లో 200 మంది ఊచకోత..!

Nigeria: నైజీరియాలో మారణహోమం.. రెండు గ్రామాల్లో 200 మంది ఊచకోత..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

నైజీరియాలో (Nigeria) సాయుధ దుండగులు భయానక మారణహోమం సృష్టించారు. క్వారా రాష్ట్రంలోని వోరో, నూక అనే రెండు గ్రామాలపై ఆకస్మికంగా దాడులు జరిపిన దుండగులు, దాదాపు 200 మందిని అమానుషంగా హత్య చేశారు. ఈ దాడుల్లో అనేక ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి. వోరో గ్రామానికి చెందిన స్థానిక నాయకుడు సైదుబాబా అహ్మద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. దుండగులు గ్రామస్తులను చుట్టుముట్టి, వారి చేతులను వెనక్కి కట్టి అనంతరం కాల్చి చంపారు. దాడి సమయంలో పలువురు భయంతో పరుగు తీశారని.. ప్రస్తుతం వారి ఆచూకీ తెలియడం లేదని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు స్థానిక మీడియాలో ప్రసారమవుతున్నాయి. వీధులన్నీ మృతదేహాలతో నిండిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

కాట్సినా రాష్ట్రంలో కూడా దుండగుల దాడులు

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ దారుణ ఘటనను అమ్నెస్టి ఇంటర్నేషనల్ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది. గత ఐదు నెలలుగా దుండగులు గ్రామస్తులకు హెచ్చరికల లేఖలు పంపుతున్నప్పటికీ, భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల ఈ ప్రాంతంలో నైజీరియా సైన్యం ఉగ్రవాదులపై ఆపరేషన్లు నిర్వహించి దాదాపు 150మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సైనిక చర్యలకు ప్రతీకారంగా ఈ తాజా దాడులు జరిగాయని క్వారా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. దీనిని ఆయన పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇదిలా ఉండగా, కాట్సినా రాష్ట్రంలో కూడా దుండగుల దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 21 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.

Advertisement