Page Loader
26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత 
26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత

26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ప్రధాన అనుచరుడు కరాచీలో కాల్చివేత 

వ్రాసిన వారు Stalin
Oct 01, 2023
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మోస్ట్ వాంటెడ్ నాయకుల్లో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్‌ను కరాచీలో హతమయ్యాడు. అజ్ఞాత వ్యక్తులు అతడిని కాల్చి చంపినట్లు పోలీసు వర్గాలు ఆదివారం తెలిపాయి. లష్కరే తోయిబా వ్యవస్థాపకుల్లో ఫరూఖ్‌ ఒకరు. 26/11ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహిత సన్నిహుడు. సమనాబాద్ ప్రాంతంలో శనివారం ఖైజర్ ఫరూఖ్‌‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఫరూఖ్‌‌కు వెనుక భాగంలో బుల్లెట్ గాయాలు కాగా, అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫరూఖ్ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, పోలీసులు ఈ ఫుటేజీని ధృవీకరించలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో