
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు యూఏఈలో సంప్రదాయ స్వాగతం .. ఇంతకీ ఈ సంప్రదాయం ఏంటంటే?(వీడియో)
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వెళ్లారు.
ఆయన యూఏఈలో అడుగుపెట్టిన వెంటనే,అక్కడి సంప్రదాయ నృత్యం 'అల్ అయ్యాలా' ద్వారా ఘనంగా స్వాగతం పలికారు.
ఈ ఉత్సాహపూరిత స్వాగత దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
యూఏఈలోకి ట్రంప్ చేరుకున్న తరువాత,ఆయన్ని అక్కడి అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆత్మీయంగా ఆహ్వానించారు.
అనంతరం ఇద్దరూ కలిసి రాష్ట్రపతి నివాసమైన ఖషర్ అల్-వాటన్ ప్రాంగణానికి చేరుకున్నారు.
అక్కడ పలువురు యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి, పొడవాటి జుట్టును విరబూసుకొని, స్థానిక సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ ట్రంప్‌కు ప్రత్యేకంగా స్వాగతం చెప్పారు.
వివరాలు
అసలు ఏంటీ అల్- అయ్యాలా?
ఈ ప్రత్యేక దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
ఈ సంప్రదాయ నృత్యం మీద ఆసక్తి చూపిస్తున్న నెటిజన్లు, దాని గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉన్నారు.
యునెస్కో (UNESCO) వివరాల ప్రకారం,'అల్-అయ్యాలా'అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్ దేశాల్లో ప్రసిద్ధి చెందిన ఒక సంప్రదాయ నృత్య రూపం.
ఈ నృత్యాన్ని సాధారణంగా సంప్రదాయ వేషధారణలో ఉండే యువతులు ప్రదర్శిస్తారు.తమ పొడవాటి జుట్టును విరబూసుకొని, సంగీత తాళానికి అనుగుణంగా తలలను ఊపుతూ నృత్యం చేస్తారు.
వివాహాలు,వేడుకలు వంటి ఉత్సవ సమయాల్లో ఈ నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
వయస్సు, లింగం లేదా సామాజిక స్థితిగతుల పరంగా ఎలాంటి భేదాలు లేకుండా, సమూహంలో ప్రతిఒక్కరినీ కలిపే ప్రాముఖ్యత 'అల్-అయ్యాలా'కు ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న 'అల్-అయ్యాలా' వీడియో ఇదే..
.@POTUS bids President Mohammed bin Zayed Al Nahyan farewell after receiving a royal welcome at Zayed International Airport in Abu Dhabi 🇺🇸🇦🇪 pic.twitter.com/NnIf6MYp44
— Rapid Response 47 (@RapidResponse47) May 15, 2025