Loading...
France Protests: ఫ్రాన్స్‌ వెళ్తున్నారా..? భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక!
ఫ్రాన్స్‌ వెళ్తున్నారా..? భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక!

France Protests: ఫ్రాన్స్‌ వెళ్తున్నారా..? భారతీయులకు ఎంబసీ కీలక హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

మౌలిక వసతుల కొరత, పెరుగుతున్న ధరలు వంటి సమస్యలతో ఫ్రాన్స్‌ అట్టుడుకుతోంది. దేశంలో నెలకొన్న అశాంతి పరిస్థితులు, స్థానికంగా అమలవుతున్న కర్ఫ్యూల నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) హెచ్చరించింది. ఫ్రాన్స్‌లో నివసిస్తున్న భారతీయులతో పాటు ఆ దేశానికి వెళ్లాలని భావిస్తున్న ప్రయాణికులకు పలు సూచనలు చేసింది నిరసనలు జరుగుతున్న ప్రాంతాలు, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఎంబసీ సూచించింది. స్థానిక ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేసే అధికారిక హెచ్చరికలు, మార్గదర్శకాలను గమనిస్తూ ఉండాలని తెలిపింది. ప్రయాణాలకు సంబంధించిన రవాణా వివరాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని పేర్కొంది. ఫ్రాన్స్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

వివరాలు

ట్రంప్‌ వ్యాఖ్యలపై మెక్రాన్‌ ఆగ్రహం

ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న నిరసనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ తీవ్రంగా ఖండించారు.

రాజకీయ ప్రయోజనాలు పొందేందుకే విదేశీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు అక్కడి ప్రభుత్వ వలస విధానాలే కారణమని ట్రంప్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈ ఆరోపణలపై స్పందించిన మెక్రాన్‌.. ట్రంప్‌ మాటలను తోసిపుచ్చారు. ''అవి మూర్ఖపు మాటలు. వాటికి ఎలాంటి ఆమోదయోగ్యత లేదని తీవ్రంగా విమర్శించారు.

దీంతో ఫ్రాన్స్‌లోని నిరసనలు, భద్రతా పరిస్థితులపై ట్రంప్‌, మెక్రాన్‌ మధ్య వ్యాఖ్యల యుద్ధం కొనసాగుతోంది.

ADVERTISEMENT