Page Loader
Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 39 మంది మృతి 
నేపాల్‌లో భారీ వరదలు.. 39 మంది మృతి

Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 39 మంది మృతి 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2024
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా 39 మంది మృతి చెందగా, 11 మంది గల్లంతైనట్లు అధికారులు. ఆ దేశంలోని ఎనిమిది జిల్లాల్లో భారీగా వరదలు సంభవించాయి. ముఖ్యంగా ఖట్మాండ్, లలిత్‌పూర్, భక్తపూర్, కవ్రేపాలన్‌చౌక్ వంటి ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు 760 మందిని రక్షించినట్లు సమాచారం. నేపాల్‌లోని వరద ప్రభావం పొరుగు రాష్ట్రం బిహార్‌ మీద కూడా పడనుంది.

Details

బిహార్‌కు వరద ముప్పు

నేపాల్ నుంచి ప్రవహించే నదులు గండక్‌, కోసి వంటి నదులు బిహార్‌లోకి ప్రవేశించే ప్రాంతాల్లో భారీ వరద ముప్పు ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే పశ్చిమ, తూర్పు చంపారన్, సీతామర్హి, పట్నా, సివాన్ తదితర ప్రాంతాల్లో నదుల నీటిమట్టాలు పెరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గంగానది పరివాహక ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గండక్ నదిపై ఉన్న వాల్మీకినగర్ బ్యారేజీ నుంచి 6.87 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.