
US:యెమెన్ యుద్ధ ప్రణాళిక రహస్యాలు.. కుటుంబసభ్యులతో పంచుకున్నఅమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా (USA) బలగాలు ఇటీవల యెమెన్ (Yemen)పై జరిపిన తీవ్ర వైమానిక దాడులు అంతర్జాతీయంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.
అయితే ఈ దాడులకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ దాడులకు సంబంధించి ప్రణాళికలు దాడులకు ముందు నుంచే లీక్ అయ్యాయని కథనాలు చెబుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం,ఈ దాడుల వెనక గూఢచార సమాచారాన్ని స్వయంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన కథనంలో స్పష్టం చేశారు.
వివరాలు
సాధారణ మెసేజింగ్ యాప్ ద్వారా అత్యంత రహస్యమైన సమాచారం
ఆ దాడులపై ప్రణాళికలు, రహస్య వివరాలను పీట్ హెగ్సెత్ తన భార్య, సోదరుడు, లాయర్‌తో ముందుగానే చర్చించినట్టు, ప్రైవేట్ సిగ్నల్ గ్రూప్ చాట్‌లో మాట్లాడినట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.
అత్యంత రహస్యమైన సమాచారాన్ని సాధారణ మెసేజింగ్ యాప్ ద్వారా పంపడం పట్ల అంతర్గతంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.