Hitler: హిట్లర్ పుట్టిన భవనాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చిన ఆస్ట్రియా
ఈ వార్తాకథనం ఏంటి
జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన చారిత్రక భవనానికి ఆస్ట్రియా ప్రభుత్వం కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగిన చర్చలు, సంప్రదింపులు,ప్రణాళికల అనంతరం ఆ భవనాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చి ప్రజా సేవలకు సిద్ధం చేసింది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.. ఆ భవనం నియో-నాజీలకు ఆరాధనా కేంద్రంగా లేదా సమావేశ స్థలంగా మారకుండా నిరోధించడమేనని అధికారులు వెల్లడించారు. జర్మనీ-ఆస్ట్రియా సరిహద్దులోని బ్రౌనౌ ఆమ్ ఇన్ పట్టణంలో 1889లో అడాల్ఫ్ హిట్లర్ జన్మించారు. అయితే,ఆయన జననం జరిగిన కొద్ది కాలానికే హిట్లర్ కుటుంబం ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టింది. అనంతర కాలంలో ఈ భవనం పలు అవసరాలకు ఉపయోగపడింది. ఒక దశలో ఇది ఆర్ట్ గ్యాలరీగా కూడా గుర్తింపు పొందింది.
వివరాలు
స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలు
హిట్లర్ జన్మస్థలం అనే కారణంతో ప్రపంచం నలుమూలల నుంచి కొంతమంది సందర్శకులు ఈ భవనాన్ని ప్రత్యేకంగా చూసేవారు.
కొన్నాళ్ల క్రితం వరకు ఈ భవనం ప్రైవేటు యాజమాన్యంలో ఉండేది.
అక్కడ దివ్యాంగుల సంక్షేమం కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలు నిర్వహించేది.
అనంతరం 2017లో ఆస్ట్రియా ప్రభుత్వం ఈ భవనాన్ని కొనుగోలు చేసి పునరుద్ధరణ పనులు చేపట్టింది.
వివరాలు
ప్రజల భద్రత కోసం సేవలు అందించే పోలీస్ స్టేషన్‌గా
హిట్లర్‌కు సంబంధించిన గుర్తింపును పూర్తిగా తొలగిస్తూ,ఈ భవనానికి సమాజానికి ఉపయోగపడే కొత్త పాత్ర కల్పించాలనే ఉద్దేశంతోనే దీనిని పోలీస్ స్టేషన్‌గా మార్చినట్లు ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
దీంతో ఒకప్పుడు చరిత్రలో వివాదాస్పద వ్యక్తి జన్మస్థలంగా గుర్తింపు పొందిన ఈ భవనం.. ఇప్పుడు ప్రజల భద్రత కోసం సేవలు అందించే పోలీస్ స్టేషన్‌గా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది.