Loading...
Brazil: బ్రెజిల్‌లో ఘోర విషాదం.. హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!
బ్రెజిల్‌లో ఘోర విషాదం.. హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!

Brazil: బ్రెజిల్‌లో ఘోర విషాదం.. హెలికాప్టర్ కూలి నలుగురు మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2026
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్థానిక కొలంబియన్ కాన్సులేట్ వెల్లడించింది. మృతుల్లో హెలికాప్టర్ పైలట్‌తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొలంబియన్ మహిళలు ఉన్నారు. రియో డి జెనీరోలోని విస్టా చినెసా సమీపంలో ఉన్న టిజుకా నేషనల్ పార్క్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లిన సమయంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబం 15 ఏళ్ల బాలిక పుట్టినరోజు వేడుకల కోసం రియో డి జెనీరోకు వచ్చినట్లు సమాచారం.

వివరాలు

రెండు వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేత

కుటుంబంలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉండగా.. హెలికాప్టర్‌లో ప్రయాణించే సామర్థ్యం పరిమితంగా ఉండటంతో ముగ్గురు మాత్రమే అందులో ప్రయాణించారు.

అయితే ఈ ప్రయాణం విషాదంగా మారి, హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు మహిళలతో పాటు పైలట్ కూడా మృతి చెందారు.

ఈ ఘటనపై రియో డి జెనీరో మేయర్ ఎడ్వర్డో కావలియర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నగరంలో పర్యాటకుల ఆకర్షణగా మారిన హెలికాప్టర్ విహారయాత్రల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త భద్రతా ప్రమాణాలను అమలు చేసే వరకు హెలికాప్టర్ విహారయాత్ర సేవలను ఒకటి లేదా రెండు వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మేయర్ తెలిపారు.

వివరాలు

ప్రమాదాలకు గల కారణాలపై విచారణ

అలాగే ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని బ్రెజిల్ నేషనల్ సివిల్ ఏవియేషన్ ఏజెన్సీని కోరినట్లు వెల్లడించారు.

రియో డి జెనీరోలో హెలికాప్టర్ ప్రమాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. జూన్ 14న రిక్రియో డోస్ బాండీరాంటెస్ శివారులో రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

వరుస ప్రమాదాల నేపథ్యంలో పర్యాటక హెలికాప్టర్ సేవల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ADVERTISEMENT