Loading...
Hundreds vs Zero: భారత్-చైనా తదుపరి ఘర్షణలో స్టెల్త్ ఫైటర్‌లే కీలకంగా మారనున్నాయా?
భారత్-చైనా తదుపరి ఘర్షణలో స్టెల్త్ ఫైటర్‌లే కీలకంగా మారనున్నాయా?

Hundreds vs Zero: భారత్-చైనా తదుపరి ఘర్షణలో స్టెల్త్ ఫైటర్‌లే కీలకంగా మారనున్నాయా?

వ్రాసిన వారు Moogati Shabari
Jul 17, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌తో పోలిస్తే స్టెల్త్ యుద్ధ విమానాల విషయంలో చైనా ఇప్పటికే భారీ ఆధిక్యంలోకి వెళ్లిపోయిందని తాజా అంచనాలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ రక్షణ పత్రిక ది వార్ జోన్లో చైనా సైనిక వ్యవహారాల విశ్లేషకుడు ఆండ్రియాస్ రుప్‌రెఖ్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం చైనా వద్ద సుమారు 500 జే-20 "మైటీ డ్రాగన్" స్టెల్త్ ఫైటర్లు సేవల్లో ఉన్నట్లు అంచనా. ఈ అంచనా నిజమైతే.. ఇప్పటివరకు ఫ్రంట్‌లైన్‌లో ఉన్నాయని భావించిన సంఖ్య కంటే ఇది రెండింతలకు పైగా ఉంటుంది. అంతేకాదు.. ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా భావించే జే-20 ఉత్పత్తిని చైనా, అమెరికాను కూడా మించే స్థాయిలో పెంచిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

వివరాలు

యుద్ధ విమానాలే లక్ష్యంగా దాడులు..

భారత్‌కు ఇది ఆందోళన కలిగించే అంశంగా మారింది. కారణం.. ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద స్టెల్త్ ఫైటర్ విమానాల సంఖ్య సున్నా.

భారత్-చైనా సరిహద్దుకు సమీపంలోని టిబెట్ ప్రాంతంలో చైనా ఇప్పటికే కొన్ని జే-20 యూనిట్లను మోహరించినట్లు గతంలో వెల్లడించింది.

ఈ స్టెల్త్ విమానాలు రాడార్‌కు చిక్కకుండా శత్రు గగనతలంలోకి చొరబడటం, తొలి దాడులు చేయడం, యుద్ధంలో ఎక్కువకాలం నిలబడేలా ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

ఆధునిక యుద్ధాల్లో స్టెల్త్ ఫైటర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ముందుగా శత్రు గగనతలంలోకి ప్రవేశించి.. ప్రత్యర్థి యుద్ధ విమానాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాయి.

వివరాలు

దాదాపు పదేళ్లు సమయం పట్టే అవకాశం..

అలాగే కీలక లక్ష్యాలను ధ్వంసం చేసి.. మిగతా వైమానిక దళానికి దాడులు నిర్వహించేందుకు మార్గం సుగమం చేస్తాయి.

ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ మరో విషయాన్ని స్పష్టంగా చూపించింది.

భవిష్యత్ యుద్ధాల్లో భారత్ అనుసరించబోయే వ్యూహంలో వైమానిక శక్తి అత్యంత కీలకమని ఈ ఆపరేషన్ మరోసారి నిరూపించింది.

అయితే చైనా స్టెల్త్ సామర్థ్యానికి సమాధానంగా భారత్ చేపడుతున్న చర్యలు ఇంకా చాలా దూరంలోనే ఉన్నాయి.

భారత్ అభివృద్ధి చేస్తున్న ఏఎంసీఏ (AMCA) స్టెల్త్ యుద్ధ విమానం పూర్తిస్థాయిలో సేవల్లోకి రావడానికి ఇంకా దాదాపు పదేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

మరోవైపు రష్యా ఎస్‌యూ-57 విమానం పూర్తిస్థాయి స్టెల్త్ ఫైటర్‌గా పరిగణించబడదు.

ADVERTISEMENT