LOADING...
Bill Gates:నేను చింతిస్తున్నాను,క్షమాపణలు కోరుతున్నాను: ఎప్‌స్టీన్‌ కుంభకోణంపై బిల్‌గేట్స్
ఎప్‌స్టీన్‌ కుంభకోణంపై బిల్‌గేట్స్

Bill Gates:నేను చింతిస్తున్నాను,క్షమాపణలు కోరుతున్నాను: ఎప్‌స్టీన్‌ కుంభకోణంపై బిల్‌గేట్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ కేసులో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ విషయంపై గేట్స్ స్పందించారు.ఎప్‌స్టీన్‌తో ఉన్న ప్రతీ క్షణానికి చింతిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆస్ట్రేలియా మీడియా సంస్థతో మాట్లాడారు. ''ఎప్‌స్టీన్‌ కోసం కేటాయించిన ప్రతి క్షణం కోసం ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. అయితే ఆ ఇమెయిల్స్‌ నిజం కాదని స్పష్టంగా చెప్పగలను. ఆ సమయంలో అతని ఆలోచనలు నాకు అర్థం కాలేదు. ఏదో ఒక విధంగా, అతను నన్ను టార్గెట్ చేయాలని ప్రయత్నించాడా అని కూడా స్పష్టంగా చెప్పలేను'' అని గేట్స్ వ్యాఖ్యానించారు.

వివరాలు 

రష్యన్‌ మహిళలతో గేట్స్‌ లైంగిక సంబంధాలు 

ఇదే సమయంలో, అమెరికా న్యాయ శాఖ ఇటీవల ఎప్‌స్టీన్‌ కేసుకు సంబంధించిన సుమారు 30 లక్షల పేజీల (Epstein files)ను రిలీజ్ చేసింది. వాటిలో గేట్స్‌ కు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఎప్‌స్టీన్‌ ఆరోపణల ప్రకారం, గేట్స్‌ రష్యన్‌ మహిళలతో లైంగిక సంబంధాలు నెరిపాడని, అందువల్ల సుఖవ్యాధుల బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. 2013లో ఎప్‌స్టీన్‌ తనకే రాసిన ఇమెయిల్‌లో ఈ విషయాలను ప్రస్తావించాడు. ఆ ఇమెయిల్‌ ప్రకారం, ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు ఆయన మిలిందా (గేట్స్‌ మాజీ భార్య)కు రహస్యంగా ఇచ్చేందుకు యాంటీబయాటిక్స్‌ను అడిగారని ఎప్‌స్టీన్‌ రాసుకొచ్చాడు. ఈ పరిణామాల తర్వాత, తనతో ఆరు సంవత్సరాలు కొనసాగిన స్నేహాన్ని గేట్స్‌ ముగించాడని ఎప్‌స్టీన్‌ తెలిపారు.

Advertisement