ఇజ్రాయెల్ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు: గాజాపై దండయాత్రపై బైడెన్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలోని హమాస్ మిలిటెంట్లు లక్ష్యంగా తాము దండయాత్ర చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడిని ఆపడం లేదా ఆలస్యం చేయడానికి అమెరికా చొరవ తీసుకుంటుందా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.
ఇజ్రాయెల్ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని, ఆ స్వేచ్ఛ ఆ దేశానికి ఉందని బైడెన్ పేర్కొన్నారు.
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల ఆకస్మిక దాడి తర్వాత పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంపై ఐక్యరాజ్య సమితి ఆందోళ వ్యక్తం చేసింది.
గాజాలో గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. అయితే ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తిని ఇజ్రాయెల్ తిరస్కరించింది.
గాజా
గాజాలో సామూహిక హత్యలు జరగడం లేదు: ఇజ్రాయెల్
గాజాలో పిల్లలు, మహిళలు, వృద్ధులపై సామూహిక హత్యలకు పాల్పడటం లేదని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‍కు ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ వివరించారు.
ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ హమాస్ మాట్లాడుతూ.. తమ ఉనికి లేకుండా చేస్తానన్న వారితో తాము కాల్పుల విరమణ ఎలా చేసుకోవాలన్నారు.
కొంతమంది హమాస్ ఉగ్రవాదులు సముద్రం ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఐడీఎఫ్ పేర్కొంది.
గాజా తీరంలో సొరంగాల నుంచి ఉగ్రవాదులు పారిపోతున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి.
గాజాలో ఉగ్రవాదులు ఉపయోగించిన ఆయుధాల గోదాంతో పాటు సొరంగం కూడా తాము ఛేదించినట్లు ఐడీఎఫ్ తెలిపింది.