Imran Khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 10ఏళ్ల జైలు శిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
సార్వత్రిక ఎన్నికల వేళ.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీలకు పదేళ్ల జైలు శిక్ష పడింది.
దేశానికి సంబంధించిన రహస్య పత్రాల సమాచారాన్ని లీక్ చేసినట్లు నిర్ధారించిన ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలను దోషులుగా తేల్చింది.
ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్, ఖురేషీ రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.
ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇమ్రాన్ పార్టీ 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' (పీటీఐ)కి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి.
పాక్
ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం?
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో మార్చి 27, 2022న జరిగిన బహిరంగ సభలో యూఎస్‌లోని పాక్ ఎంబసీ పంపిన రహస్య దౌత్య పత్రాలను బహిరంగపర్చడంతో కోర్టు దోషిగా తేల్చింది.
రహస్య పత్రాలను బహిర్గతం చేస్తూ, అమెరికా ఆదేశాల మేరకు తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ ఖాన్ ఆ బహిరంగ సభలో ఆరోపించారు.
ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికే, ఏప్రిల్ 2022లో, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయింది.
ఇమ్రాన్ ఖాన్‌ను అధికారం నుంచి తొలగించినప్పటి నుంచి ఆయనపై 150కి పైగా కేసులు నమోదయ్యాయి.
ఇమ్రాన్ ఖాన్‌కు ఇప్పుడు శిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్టీని నిషేధం విధించే అవకాశం ఉందని పాక్ మీడియా చెబుతోంది.