
పాకిస్థాన్: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావల్పిండికి వెళ్లే హజారా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 10బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో 22మంది మరణించారు. 80మంది గాయపడ్డారు.
షాజాద్‌పూర్-నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని జియో టీవీ నివేదించింది.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అధికారులు రెస్క్యూ టీమ్‌ను మోహరించారు. ప్రస్తుతం రెస్క్యూ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
పట్టాలు తప్పిన కంపార్ట్‌మెంట్‌ల నుంచి ప్రయాణికులను బయటకు తీస్తున్నట్లు పాకిస్తాన్ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ మహమూద్ రెహ్మాన్ చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
క్షతగాత్రులను నవాబ్‌షాలోని పీపుల్స్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రైలు పట్టాలు తప్పిన దృశ్యం
#Sindh #Pakistan🇵🇰- At least 15 people killed while 40 others injured after Hazara Express passenger train derails causing ten bogies to overturn near Sarhari Railway Station in #Nawabshah, officials said (📹DileepKumarPak) pic.twitter.com/I0N6h0RG7N
— CyclistAnons🚲 (@CyclistAnons) August 6, 2023