Russia Sanctions Bill: రష్యాపై అమెరికా కొత్త ఆంక్షల బిల్లు.. భారత్‌పై 100% టారిఫ్‌ల ముప్పు?
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా ఇంధన ఎగుమతుల ద్వారా పొందుతున్న ఆదాయాన్ని మరింత నియంత్రించే లక్ష్యంతో అమెరికా మరో కీలక ఆంక్షల బిల్లును ముందుకు తీసుకొచ్చింది. రష్యా సాంక్షన్స్ బిల్‌ను పరిశీలించేందుకు అమెరికా సెనెట్ సభ్యులు ఆమోదం తెలపడంతో,ఈ బిల్లు చట్టంగా మారే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, రష్యా నుంచి చమురు,సహజ వాయువు కొనుగోలు చేస్తున్న భారత్,చైనా వంటి దేశాలపై కూడా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ బిల్లును పరిశీలించేందుకు అమెరికా సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో 86-12ఓట్ల తేడాతో సభ్యులు అంగీకారం తెలిపారు.
వివరాలు
రెండు దశలు పూర్తైన తర్వాతే బిల్లు చట్టరూపం
తదుపరి ఈ బిల్లుకు సెనెట్ పూర్తి ఆమోదం లభించాల్సి ఉండగా, అనంతరం ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
ఈ రెండు దశలు పూర్తైన తర్వాతే బిల్లు చట్టరూపం దాల్చుతుంది. బిల్లు అమల్లోకి వస్తే, రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్'కు లభించనుంది.
దీంతో రష్యా ఇంధన దిగుమతులపై ఆధారపడుతున్న భారత్, చైనా వంటి దేశాలు అధిక సుంకాల ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడే అవకాశముంది.
వివరాలు
రెండు దశలు పూర్తైన తర్వాతే బిల్లు చట్టరూపం
ఈ ప్రతిపాదిత చర్య ప్రధానంగా రష్యా ఇంధన ఎగుమతుల ద్వారా లభిస్తున్న ఆదాయాన్ని తగ్గించడమే లక్ష్యంగా రూపొందించబడింది.
అయితే, రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న దేశాల వాణిజ్యంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.