T-72 tank: భారత్-రష్యా భారీ డీల్.. T-72 ట్యాంకుల అప్‌గ్రేడ్‌కు $248 మిలియన్ ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, రష్యాతో భారీ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. T-72 ట్యాంకులను అప్‌గ్రేడ్ చేయడానికి ఏకంగా 248 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.
ప్రాంతీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో T-72 ట్యాంకుల 780 HP ఇంజన్లను 1000 HPకి అప్‌గ్రేడ్ చేయడానికి ఈ డీల్ కుదిరింది.
ఈ ఒప్పందం కింద 1,000-హార్స్‌పవర్ (HP) ఇంజిన్లను పూర్తిగా అసెంబుల్ చేయడమేకాక, నాక్-డౌన్, సెమీ-నాక్ డౌన్ స్థితిలో కూడా సరఫరా చేయనున్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖ, రష్యా రక్షణ సంస్థ రోసోబోరోనెక్స్‌పోర్ట్ మధ్య శుక్రవారం సంతకాలు జరిగాయి.
Details
కొత్త శక్తితో ముందుకు దూసుకెళ్లనున్న భారత ట్యాంకులు
ఈ ఒప్పందంలో భాగంగా, రష్యన్ రక్షణ తయారీ సంస్థ నుంచి చెన్నైకి చెందిన ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (హెవీ వెహికల్ ఫ్యాక్టరీ)కి టెక్నాలజీ బదిలీ చేయనున్నారు.
రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా' ను మరింతగా ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడనుంది. భారత సైన్యంలోని ట్యాంక్ ఫ్లీట్‌లో T-72 కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రస్తుతం 780 హెచ్‌పీ ఇంజన్లు అమర్చిన ఈ ట్యాంకులకు 1000 హెచ్‌పీ ఇంజన్లు మార్చడం ద్వారా వేగం, దాడి సామర్థ్యం గణనీయంగా మెరుగవుతుంది.