Loading...
UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్‌ 27న అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం
ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్‌ 27న అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం

UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్‌ 27న అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాల్య వివాహాల నిర్మూలన కోసం భారత్‌ కొనసాగిస్తున్న పోరాటానికి ఎట్టకేలకు అంతర్జాతీయ స్థాయిలో కీలక గుర్తింపు లభించింది. బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రతి ఏడాది నవంబర్ 27న 'బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం'గా పాటించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారత్‌లో కొనసాగుతున్న ఉద్యమానికి ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్త మద్దతుగా భావిస్తున్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ 2023 నుంచి 'చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా' ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

వివరాలు

ఆ తీర్మానానికి ఆమోదం

ప్రజల్లో బాల్య వివాహాలపై అవగాహన కల్పించడం, ప్రభుత్వాలు, సమాజాన్ని ఈ సమస్యపై కార్యాచరణ వైపు నడిపించడం ఈ ప్రచారం ప్రధాన లక్ష్యాలుగా కొనసాగుతోంది.

బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రత్యేక అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు 'భువన్ రిభు' ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించారు.

ఆయన ప్రతిపాదనపై సియెర్రా లియోన్ సెప్టెంబర్ 4న ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.

అనంతరం ఆ తీర్మానానికి ఆమోదం లభించింది. నవంబర్ 27 తేదీకి భారత్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

వివరాలు

నవంబర్ 27కు భారత్‌లో ప్రత్యేక ప్రాధాన్యం

2024 నవంబర్ 27న భారత ప్రభుత్వం 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' ప్రచారాన్ని ప్రారంభించింది.

ఇప్పుడు అదే రోజును ఐక్యరాజ్యసమితి బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించడం విశేషంగా మారింది.

ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని భువన్ రిభు స్వాగతించారు. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమైన రోజని ఆయన పేర్కొన్నారు.

తీర్మానం ఆమోదించే సమయంలో ఐక్యరాజ్యసమితికి ఆహ్వానించిన ఏకైక పౌర సమాజ ప్రతినిధి తానేనని తెలిపారు.

2024 నవంబర్ 27న బాల్య వివాహాలకు వ్యతిరేకంగా భారత్‌లో చేపట్టిన ప్రచారంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రతిజ్ఞ చేశారని రిభు వెల్లడించారు.

పిల్లలు, స్థానిక సమాజాల నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమానికి ప్రభుత్వం మద్దతు ఇచ్చి మరింత విస్తరించిందని చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు

భారత్‌లో తగ్గుతున్న బాల్య వివాహాలు

బాల్య వివాహాల నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు నిర్ణయాత్మక నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందని భువన్ రిభు అన్నారు.

2030 నాటికి బాల్య వివాహాలను పూర్తిగా అంతం చేయడంతో పాటు ప్రతి చిన్నారికి విద్య, రక్షణ, అభివృద్ధి అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.

భారత్‌లో బాల్య వివాహాల శాతం క్రమంగా తగ్గుతున్నట్లు జాతీయ స్థాయి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2019-21 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) ప్రకారం.. 20-24 ఏళ్ల వయసున్న మహిళల్లో 23.3 శాతం మంది 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నారు.

అయితే NFHS-6 (2023-24)లో ఈ శాతం 20.1కి తగ్గింది. బాల్య వివాహాల నిర్మూలన కోసం దేశంలో కొనసాగుతున్న ప్రయత్నాల ప్రభావాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

బాల్య విహహాలు తగ్గుతున్నాయి

భారత్‌లో బాల్య వివాహాల శాతం క్రమంగా తగ్గుతున్నట్లు జాతీయ స్థాయి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2019-21 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) ప్రకారం.. 20-24 ఏళ్ల వయసున్న మహిళల్లో 23.3 శాతం మంది 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నారు.

అయితే NFHS-6 (2023-24)లో ఈ శాతం 20.1కి తగ్గింది.

బాల్య వివాహాల నిర్మూలన కోసం దేశంలో కొనసాగుతున్న ప్రయత్నాల ప్రభావాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని భావిస్తున్నారు.

వివరాలు

2026 నాటికి 10 శాతం తగ్గించడమే లక్ష్యం

భారత ప్రభుత్వం 2026 నాటికి దేశంలో బాల్య వివాహాల ప్రాబల్యాన్ని 10 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి బాల్య వివాహాలను నిర్మూలించాలన్న లక్ష్యం ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్-5 (లింగ సమానత్వం)లోని టార్గెట్ 5.3తో అనుసంధానమై ఉంది.

బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాలతో పాటు అన్ని రకాల హానికరమైన ఆచారాలను నిర్మూలించడం కూడా ఈ లక్ష్యంలో భాగంగా ఉంది.

ADVERTISEMENT