
India Statement On Trump Putin meet: ట్రంప్- పుతిన్ ప్రయత్నాలపై హర్షం వ్యక్తం చేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాల్లో భాగంగా అలాస్కాలో అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశాన్ని భారత్ స్వాగతించింది. భారత విదేశాంగశాఖ (MEA) ఈ సమావేశంలో సాధించిన పురోగతిని అభినందిస్తూ, దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కారం సాధించాలన్నది ప్రధానమైన లక్ష్యమని వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రకారం, ప్రపంచం వేగంగా ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం పొందాలని ఆశిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత వ్లాడిమిర్ పుతిన్ (Vladimir Putin)ల మధ్య అలాస్కాలో జరిగిన సమావేశాన్ని స్వాగతిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది.
Details
యుద్ధంపై ముగింపు రావాలి
శాంతి సాధన దిశగా ఈ ప్రయత్నాలు ఎంతో ప్రశంసనీయమని చర్చలని వెల్లడించింది. దౌత్య మార్గాల్లో సమస్య పరిష్కారం మాత్రమే సరిగా ముందుకు తీసుకుపోతుందని, ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరగా ముగింపు రావాలని ప్రపంచం కోరుకుంటోందని స్పష్టం చేసింది. ఇంకా ట్రంప్, పుతిన్‌ల భేటీని స్వాగతిస్తూ, ''ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికే అవకాశం ఇది. ఇది యుద్ధాల కాలం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపిన సందేశానికి దోహదం చేస్తుందని MEA అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు