LOADING...
USA: 2008 నుండి ఇండో-అమెరికన్లు US విశ్వవిద్యాలయాలకు భారీగా విరాళాలు..!
2008 నుండి ఇండో-అమెరికన్లు US విశ్వవిద్యాలయాలకు భారీగా విరాళాలు..!

USA: 2008 నుండి ఇండో-అమెరికన్లు US విశ్వవిద్యాలయాలకు భారీగా విరాళాలు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2025
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం, ఇండో-అమెరికన్లు (Indian Americans) అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు విస్తృతంగా విరాళాలు అందజేస్తున్నారని వెల్లడైంది. ఇండియాస్‌పోర సంస్థ రూపొందించిన 2024 ఇంపాక్ట్ రిపోర్ట్ను బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో కలిసి సిద్ధం చేశారు. ఇందులో భారతీయుల విరాళాలు అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఎలా కీలకంగా మారుతున్నాయో స్పష్టంగా చూపించారు. ఇండియాస్‌పోర ఛైర్మన్ ఎం.ఆర్. రంగస్వామి ప్రకారం.. ఇండో-అమెరికన్లు తమ కెరీర్ ఆరంభానికి సహకరించిన విద్యాసంస్థలకు కేవలం కృతజ్ఞతా మాటలతోనే కాకుండా ఆర్థిక సహకారం ద్వారా కూడా తోడ్పడుతున్నారని తెలిపారు. అమెరికా (USA) భవిష్యత్తుపై వారికి గట్టి విశ్వాసం ఉందని, ఆ దేశం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

అక్కడి విశ్వవిద్యాలయాలకు మొత్తం రూ.25,000 కోట్లు

నివేదికలోని గణాంకాల ప్రకారం, 78 శాతం ఇండో-అమెరికన్లు కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యను పూర్తిచేశారు. ప్రస్తుతానికి అమెరికాలో సుమారు 2,70,000 భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారి ద్వారా ఆ దేశానికి ప్రతి సంవత్సరం సుమారు 10 బిలియన్ డాలర్ల (రూ.83 వేల కోట్లకు పైగా) ఆదాయం లభిస్తోంది. అలాగే, 2008లో ఇండో-అమెరికన్లు అక్కడి విశ్వవిద్యాలయాలకు మొత్తం రూ.25,000 కోట్ల విరాళాలు అందజేశారు. ఈ విరాళాల్లో అధిక భాగం మెడికల్‌, హెల్త్ సైన్స్‌, ఇంజినీరింగ్‌, బిజినెస్ ఎడ్యుకేషన్ వంటి రంగాలకు వెళ్ళింది. అదనంగా, సాంస్కృతిక పరిరక్షణ కోసం కూడా సుమారు రూ.1,170 కోట్లు విరాళంగా అందాయి.