Page Loader
యూకేలో భారతీయం; సంబల్‌పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ 
యూకేలో భారతీయం; సంబల్‌పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ

యూకేలో భారతీయం; సంబల్‌పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ 

వ్రాసిన వారు Stalin
Apr 19, 2023
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూకేలో ఒడిశాకు చెందిన ఓ మహిళ చేసిన ఫీట్ ఆకట్టుకుంది. 41 ఏళ్ల మధుస్మిత జెనా దాస్ భారతీయ సంప్రదాయ సంబల్‌పురి చేనేత చీరను ధరించి మాంచెస్టర్‌లో 42.5కి.మీ మారథాన్‌లో నడిచింది. ఒడియా సంప్రదాయ చీకరట్టులో ఆమె మారథాన్‌ను 4 గంటల 50నిమిషాల్లో పూర్తి చేసింది ప్రశంసలు అందుకుంది. అందరూ రన్నింగ్ అవుట్ ఫిట్‌ను ధరించి మారథాన్‌లో పాల్గొనగా మధుస్మిత జెనా దాస్ మాత్రమే సంప్రదాయ చీరలో ప్రత్యేకంగా కనపడ్డారు. ఆరెంజ్ స్నీకర్స్‌తో పాటు అందమైన ఎర్రటి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన తీరు అందరి దృష్టి ఆమె వైపు మళ్లేలా చేసింది. మారథాన్‌లో మధుస్మిత జెనా దాస్ పాల్గొన్న ఫొటోలను ఒక వ్యక్తి ట్విట్టర్‌లో పోస్టు చేయగా అవి వైరల్‌గా మారాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సంబల్‌పురి చీర కట్టులో మారథాన్‌లో పాల్గొన్న మధుస్మిత జెనా దాస్