LOADING...
Iran War: కువైట్‌పై ఇరాన్ దాడి.. భారత కార్మికుడు మృతి.. ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య
కువైట్‌పై ఇరాన్ దాడి.. భారత కార్మికుడు మృతి.. ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య

Iran War: కువైట్‌పై ఇరాన్ దాడి.. భారత కార్మికుడు మృతి.. ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 30, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు వైమానిక దాడులతోనే కొనసాగిన అమెరికా సైనిక చర్యలు,ఇక భూతల దాడుల దిశగా మళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ కూడా ప్రతిదాడులతో పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కువైట్‌లో జరిగిన దాడిలో ఒక భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం,ఆదివారం సాయంత్రం ఇరాన్ దాడుల సమయంలో కువైట్‌లోని ఒక కీలక విద్యుత్,నీటి డీసాలినేషన్ ప్లాంట్‌పై దాడి జరిగింది. ఆ ప్లాంట్‌లోని సర్వీస్ భవనం లక్ష్యంగా మారడంతో భారీ నష్టం సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికుడు మరణించగా, భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా క్షిపణి అవశేషాలు

సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా, పశ్చిమ ఆసియా యుద్ధంలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి చేరింది. గత వారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా క్షిపణి అవశేషాలు పడటంతో ఒక భారతీయుడు మృతి చెందిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం ముందుగా ఏడు మంది భారతీయులు మరణించారని, మరో వ్యక్తి కనిపించకుండా పోయాడని తెలిపింది. ' తాజా ఘటనతో ఈ సంఖ్య మరింత పెరిగింది. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Advertisement